వ్యాక్సిన్ దోపిడీ చేసిన దొంగలు.. ఆస్పత్రి స్టోర్ రూం పగలగొట్టి ఎత్తుకెళ్లారు.. పీపీ కిట్లు వేసుకుని వచ్చిన దొంగలు

covid vaccine stole by theives

ఇళ్లల్లో దోపిడీకి వస్తే బంగారం, డబ్బు దోచుకుంటారు.. దొంగతనం చేసే ఇల్లు, షాపును బట్టి దోపిడీ ఉంటుంది.. ఇప్పుడు దొంగలు రూటు మార్చారు. మార్కెట్ లో ఇప్పుడు అత్యంత విలువైనది వ్యాక్సిన్ గా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలోని స్టోర్ రూం తలుపులు పగలగొట్టి.. వ్యాక్సిన్ ఎత్తుకెళ్లారు దొంగలు.

హర్యానా రాష్ట్రం జింద్ జిల్లా కేంద్రంలోని పీపీ సెంటర్ జనరల్ ఆస్పత్రి స్టోర్ రూంలో కరోనా వ్యాక్సిన్ నిల్వ చేశారు అధికారులు. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆస్పత్రిలోకి ప్రవేశించి.. నిల్వ ఉంచి వెయ్యి 710 డోసులు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆస్పత్రికి వచ్చిన సిబ్బంది విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆస్పత్రిలోని వ్యాక్సిన్ దొంగతనం కావటంతో ఆస్పత్రిలో ఇవాల్టి పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఇది ఆస్పత్రి సిబ్బంది ప్రమేయంతోనే జరిగిందా.. బయట వ్యక్తుల పనా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో దొంగలు పీపీ కిట్లు ధరించి ఉండటంతో వాళ్లను గుర్తు పట్టటం కష్టంగా ఉందని చెబుతున్నారు పోలీసులు. చాలా పకడ్బందీగా వ్యాక్సిన్ దొంగతనం చేశారని చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు