కవిడ్-19: కోవాక్సీన్ మరియు కోవిషీల్డ్ రెండిటి నుంచి మంచి ఫలితాలు తేల్చిన అధ్యయనం.

ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు.. పరిగెత్తండీ రో..

తాజాగా జరిగిన ఒక క్షేత్ర స్థాయి అధ్యయనంలో కోవాక్సీన్ మరియు కోవిషీల్డ్ రెండు మంచి ఫలితాలు ఇస్తున్నాయి అని తేలింది. ఇప్పటికి వరకు జరిగిన అధ్యనాలు అన్ని ల్యాబ్ లో జరిగినవి కానీ దేశంలో ఇలాంటి క్షేత్ర స్థాయి సర్వే చేయడం ఇదే తొలిసారి.13 రాష్ట్రాలకి చెందిన 515 మంది హెల్త్ కేర్ వర్కర్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి

వీరిలో 425 మంది కోవిషీల్డ్ టీకా మరియు 90 కోవాక్సీన్ టీకా తీసుకున్నారు.రెండు టీకాలు దాదాపు 95 శాతం వరకు వ్యాధి నుంచి పోరాడే సామర్ధ్యాన్ని పెంచినట్టు తేలింది మరియు టీకా తీసుకున్న తరువాత వీరికి వ్యాధి సోకినా లక్షణాల తీవ్రత కూడా తక్కువగా వుంది అని తేల్చింది.

అయితే కోవాక్సీన్ కన్నా కోవిషీల్డ్ ఎక్కువ మందిలో యాంటీబాడీలని ఉత్పత్తి అయ్యేలా చేసింది.మరియు సిరోపోసిటివిటీ కూడా కోవిషీల్డ్ తీసుకున్న వారిలో 100 కి 98 శాతం కాగా కోవాక్సీన్లో ఇది 100 కి 80 శాతం వుంది. 60 ఏళ్ళు దాటినా వారిలో సిరోపోసిటివిటీ రేటు 87.2 శాతం కాగా. 60 ఏళ్ళు లోపు వారిలో ఇది 96.3 శాతంగా నిలిచింది.

వయస్సు,లింగము,బాడీ మాస్ ఇండెక్స్ లేదా ఇతర రకాల వ్యధలు వున్నా వారికి మరియు లేని వారిలో ఎలాంటి తేడా కనిపించలేదు.కేవలం 60 ఏళ్ళు పైపడిన మరియు టైప్ 2 డయాబెటిస్ వున్నా వారిలో మాత్రం ఈ సిరోపోసిటివిటీ రేటు తగ్గింది.

సిరోపోసిటివిటీ అనగా మనం టీకా తీసుకున్న అప్పుడు సిరోపోసిటివిటీ టెస్ట్ చేయిస్తే మన శరీరం యాంటీబాడీలని ఉత్పత్తి చేస్తే అది పాజిటివ్ గా చేయకపోతే నెగటివ్ గా వస్తుంది. టీకా యొక్క సామర్ధ్యాన్ని చెప్పడానికి దీనిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు