ఢిల్లీలో లాక్ డౌన్ – కేజ్రీవాల్ సంచలన నిర్ణయం : వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దు..

lockdown in delhi

దేశ రాజధానిలో లాక్ డౌన్ విధించారు సీఎం కేజ్రీవాల్. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19వ తేదీ రాత్రి నుంచి ఆరు రోజులపాటు.. అంటే ఏప్రిల్ 25వ తేదీ రాత్రి వరకు ఈ లాక్ డౌన్ ఉంటుంది.

కష్టమైనా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని ప్రకటిస్తూ.. వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దని.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని.. వలస కార్మికులకు కావాల్సిన అన్న సౌకర్యాలు, ఆహారం ప్రభుత్వమే అందిస్తుందని.. ఎవరూ రోడ్డెక్కొద్దని వివరించారు.

ఢిల్లీలో ఏప్రిల్ 18వ తేదీ 31 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు చాలా తక్కువగా ుంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షల్లోకి వెళ్లింది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. ఈ నిర్ణయం తప్పలేదని ప్రకటించారు కేజ్రీవాల్. ఆరు రోజుల్లో అంతా సర్దుకుంటుందని.. అప్పటి వరకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిన పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుందని.. ఆర్థిక వ్యవస్థ సైతం అల్లకల్లోలం అవుతుందని.. ముందు జాగ్రత్తగానే కేవలం ఆరు రోజులు మాత్రమే లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేజ్రీవాల్.

See also : నిత్యావసరాల కోసం ఎగబడుతున్న జనం.. లిక్కర్ షాపుల దగ్గర తోపులాటలు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు