#Delhi farmers protest వివాహా విందు కోసం ఆస్ట్రేలియా నుండి వచ్చాడు : ఢిల్లీ రైతు ర్యాలీలో మరణించాడు

australia return youngster died in farmers protest

Delhi farmers protest : ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకోని ఒక వ్యక్తి మరణించిన విషయం తెలిసింది. అయితే మరణించిన ఆ వ్యక్తి గురించి పోలీసులకు అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన ఆ వ్యక్తికి రైతుల నిరసనలకు అసలు సంబంధం లేదని తేల్చారు.

 మరణించిన సదరు వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ లోని రామ్ పూర్ జిల్లాకు చెందిన న‌వ్రీత్ సింగ్ (27) గా గుర్తించారు. నవ్రీత్ సింగ్ ఇటీవలే ఆస్ట్రేలియా వివాహాం చేసుకున్నాడు. అత్తవారింట వివాహ విందులో పాల్గొనడానికి ఇటీవలే ఇండియాకు వచ్చిన నవ్రీత్ సింగ్ , విందు అనంతరం తోటి వారితో కలసి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లాడు.

అతి వేగం కారణంగా ట్రాక్టర్ బోల్తా – ట్రాక్టర్ కింద పడి మరణం

ట్రాక్టర్ ను నడుపుతున్న నవ్రీత్ సింగ్ తీవ్రమైన ఆవేశంతో పోలీసులు అడ్డుగాపెట్టిన భారీకేడ్లను బలంగా ఢీకొట్టాడు. ట్రాక్టర్ వేగం అతిగా ఉండటంతో క్షణాల్లో ట్రాక్టర్ బోల్తాపడటం దానికింద పడి నవ్రీత్ చనిపోవడం జరిగిపోయింది. అయితే పోలీసుల కాల్పుల్లో అతను మరణించాడనే పుకార్లు క్షణాల్లో వ్యాపించడంటో ర్యాలీ మొత్తం తీవ్రమైన ఉద్రిక్తలకు దారితీసింది.

అయితే బుల్లెట్లు తగిలి మరణించాడనడానికి ఎటువంటి అధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాల్లో సైతం అతనిపై బుల్లెట్లు ఫైర్ అయినట్టు ఆధారాలు లేవని తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం నవ్రీత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎక్కడో అస్ట్రేలియా నుండి విందు కోసం వచ్చి రైతు నిరసనల్లో మరణించిన నవ్రీత్ కు కడసారి వీడ్గోలు చెప్పడానికి అతని ఇంటి వద్ద పెద్ద ఎత్తున స్థానికులు బారులుతీరారు.

See also : కుక్కను చంపి బతికించా – తల్లిదండ్రులను నమ్మించిన అలేఖ్య

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు