పబ్లిసిటీ కోసం పిటీషన్ వేస్తారా.. 20 లక్షల ఫైన్ కట్టండి.. హీరోయిన్ కు హైకోర్టు షాక్

పబ్లిసిటీ కోసం పిటీషన్ వేస్తారా.. 20 లక్షల ఫైన్ కట్టండి.. హీరోయిన్ కు హైకోర్టు షాక్

పబ్లిసిటీ కోసం పిటీషన్ వేస్తారా.. 20 లక్షల ఫైన్ కట్టండి.. హీరోయిన్ కు హైకోర్టు షాక్

ఏది పడితే ఆ అంశంపై పిటీషన్లు వేస్తారా.. ఇలా అయితే కోర్టు సమయం వృధా అవుతుంది.. పిటీషన్ లో మీరు లేవనెత్తిన అంశాలు సహేతుకంగా లేవు.. అదే విధంగా మీరు ఆరోపిస్తున్నట్లు తగిన సాక్ష్యాలు సైతం లేవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ కోర్టు.. పిటీషన్ వేసిన వెటరన్ హీరోయిన్ జూహ్లీచావ్లాకు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది.

సీనియర్ యాక్టర్ జూహ్లీజావ్లా ఇటీవల కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసింది. 5జీ నెట్ వర్క్ సర్వీసుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని.. రేడియేషన్ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని.. దేశంలో 5జీ సేవలను అడ్డుకోవాలని పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు.. పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటీషన్ వేశారంటూ జూహ్లీచావ్లాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఈ అంశాన్ని ముందుగా తీసుకెళ్లాల్సింది, తేల్చుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం దగ్గర.. అలా కాకుండా నేరుగా కోర్టుకు రావటం వెనక ఉద్దేశం ఏంటీ అని నేరుగా ప్రశ్నించింది హైకోర్టు. చీప్ పబ్లిసిటీ కోసం కోర్టుల్లో ఇలాంటి పిటీషన్లు వేసినట్లు భావిస్తూ.. 20 లక్షల రూపాయల జరిమానా కట్టాలని ఆదేశించింది హైకోర్టు. జరిమానా కట్టటానికి వారం రోజుల గడువు విధించింది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు