ఢిల్లీకి ఏంటీ దరిద్రం.. ఆస్పత్రులకు పోటెత్తుతున్న పిల్లలు.. అప్రమత్తం అయిన ప్రభుత్వం

ఢిల్లీకి ఏంటీ దరిద్రం.. ఆస్పత్రులకు పోటెత్తుతున్న పిల్లలు.. అప్రమత్తం అయిన ప్రభుత్వం

ఢిల్లీకి ఏంటీ దరిద్రం.. ఆస్పత్రులకు పోటెత్తుతున్న పిల్లలు.. అప్రమత్తం అయిన ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీ మరో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా తగ్గిందని ఆనందం ఆవిరి అయ్యింది. వేలాది మంది పిల్లలు ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ బయట పడుతుండటంతో.. పిల్లల ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.

ఢిల్లీ వ్యాప్తంగా ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో పిల్లల సంఖ్య క్రమంగా పెరగటంతో ఆస్పత్రి యాజమాన్యాలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. దీనిపై విచారణ చేసిన ప్రభుత్వం అసలు విషయాన్ని నిర్థారించింది. కరోనా బారిన పడిన పిల్లలు కోలుకున్న తర్వాత.. ఇప్పుడు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని నిర్థారించింది. కడుపులో నొప్పి, కళ్లకు ఎలర్జీలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, ఏదోలా ఉందంటూ తెలియని బాధను వ్యక్తం చేస్తున్నారంట పిల్లలు. ముక్కులు పట్టేయటం, చెవి సమస్యలు వంటివి కూడా గుర్తించారు డాక్టర్లు. కరోనా తగ్గిన తర్వాత ఇలాంటి లక్షణాలతో వేలాది మంది పిల్లలు బాధపడుతుండటంతో.. తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

మూడు రోజులుగా అంటే జూన్ 14, 15, 16 తేదీల్లోనే చాలా మంది పిల్లలు.. ఇలాంటి సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. వీరికి సాధారణ చికిత్స అందించటం ద్వారా రెండు, మూడు గంటల్లోనే డిశ్చార్జ్ పంపిస్తున్నట్లు వివరించారు డాక్టర్లు. ఐదు శాతం కేసులు క్రిటికల్ గా ఉంటున్నాయని.. వీరిని ఇన్ పేషెంట్ ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు వివరించారు.

చాలా మంది పిల్లలకు కరోనా వచ్చిందన్న సంగతి తెలియకుండానే తగ్గిపోయిందని.. ఆస్పత్రికి వచ్చిన తర్వాత యాంటీ బాడీస్ పరీక్షలు చేయటం ద్వారా కరోనా వచ్చిన విషయాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు వైద్యులు. పదేళ్లలోపు పిల్లలే 90 శాతం మంది ఉన్నారని.. ముందు జాగ్రత్తగా పిల్లల డాక్టర్లను అందుబాటులో ఉంటామని తెలిపారు వైద్యులు.

ఢిల్లీ ప్రభుత్వం సైతం అప్రమత్తం అయ్యింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులు భారీగా తగ్గిపోవటంతో.. ఇన్ఫెక్షన్ తో వచ్చే పిల్లల కోసం ప్రత్యేక వార్డులు, వైద్య బృందాలను సిద్ధం చేస్తుంది. చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ ఐదు రోజుల్లో తగ్గిపోతాయని.. ఆస్పత్రిలో చేరే కేసు కేవలం 5 శాతంగానే ఉందని.. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తుంది ప్రభుత్వం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు