నిత్యావసరాల కోసం ఎగబడుతున్న జనం.. లిక్కర్ షాపుల దగ్గర తోపులాటలు..

నిత్యావసరాల కోసం ఎగబడుతున్న జనం.. లిక్కర్ షాపుల దగ్గర తోపులాటలు..

ఢిల్లీలో ఆరు రోజుల లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన వెంటనే.. ఒక్కసారి ప్రజల్లో అలజడి మొదలైంది. కిరాణా షాపుల దగ్గరకు ప్రజలు క్యూ కడుతున్నారు. రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆరు రోజుల కాస్తా.. ఇంకెన్ని రోజులు పెరుగుతుందో.. గతంలో మాదిరిగా లాక్ డౌన్ పొడిగిస్తే పరిస్థితి ఏంటీ అనే భయాలతో.. ప్రజలు నిత్యావసరాల కోసం షాపుల దగ్గరకు క్యూ కడుతున్నారు.

మరోవైపు మందు బాబులు సైతం ముందస్తు జాగ్రత్తల్లోకి వెళ్లిపోయారు. వైన్ షాపుల దగ్గర క్యూ పెరిగిపోయింది. ఒక్కొక్కరు కార్టూన్స్ తీసుకెళ్లిపోతున్నారు. పది, 20 బాటిళ్లు పట్టుకెళుతున్నారు. ముందస్తు హెచ్చరిక లేకుండా.. ఇవాళ రాత్రి నుంచి లాక్ డౌన్ అని ప్రకటించటం వల్ల.. వైన్ షాపుల దగ్గర రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఉన్న స్టాక్ అంతా కొన్ని గంటల్లోనూ పూర్తయ్యేలా ఉందని షాపు యజమానులు చెబుతున్నారు. డిమాండ్ తగ్గట్టు ఇప్పటికిప్పుడు స్టాక్ తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి.. ఉన్న స్టాక్ మాత్రమే అమ్ముతాం అంటున్నారు వైన్ షాపు యజమానులు.

కూరగాయలు, పాలు, గుడ్లు వంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. వారం, 10 రోజులు నిల్వ ఉండే వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో సూపర్ మార్కెట్లు, కూరగాయల దుకాణాలు, పాల కేంద్రాల్లోని స్టాక్ అంతా నిమిషాల్లోనే అయిపోతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు