ఢిల్లీలో ఒకే రోజు 10 వేల కరోనా కేసులు – దారుణంగా ఉందన్న కేజ్రీవాల్.. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారంగా ఆలోచన

ఢిల్లీలో ఒకే రోజు 10 వేల కరోనా కేసులు - దారుణంగా ఉందన్న కేజ్రీవాల్.. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారంగా ఆలోచన

delhi corona cases
delhi corona cases

ఢిల్లీలో ఒకే రోజు 10 వేల కరోనా కేసులు – దారుణంగా ఉందన్న కేజ్రీవాల్.. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారంగా ఆలోచన

దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏప్రిల్ 10వ తేదీ ఒక్క రోజే కొత్తగా 10 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తున్న కరోనాతో.. ప్రజలు వణికిపోతున్నారు. పరీక్షలు పెంచేకొద్దీ కేసులు సంఖ్య పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.

ఢిల్లీలో కరోనా విస్తరణ క్రమంలో.. ఢిల్లీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ కఠిన ఆంక్షలు విధించారు. మాస్క్ లేకపోయినా.. బౌతిక దూరం పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు.

అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. సినిమాలు, షికార్ల కోసం బయటకు రావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 10వ తేదీ శనివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఒకే రోజు లక్షా 50 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 15 రోజులను లెక్కలోకి తీసుకుంటే.. కొత్తగా వచ్చిన కరోనా కేసుల సంఖ్య 11 లక్షల 8 వేల 87గా ఉంది.

దేశంలో కరోనా వ్యాప్తి సెకండ్ వేవ్ కాదని.. నాలుగో విడత విస్తరణ అంటోంది ఢిల్లీ ప్రభుత్వం. ఇది చాలా తీవ్రంగా ఉందని.. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకుతుందని.. ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ అప్రమత్తంగా ఉండాలని కోరుతుంది ఢిల్లీ ప్రభుత్వం.

బయటకు వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వ్యక్తులు.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం వల్ల.. వారి ఆరోగ్యాలను కాపాడిన వారు అవుతారని తెలిపింది.

ఢిల్లీలో ఒకే రోజు 10 వేల కేసులు నమోదు కావటంతో.. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా.. ఒకటి, రెండు రోజుల్లో అధికార ప్రకటన రావొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించటం ఒక్కటే.. కరోనా వ్యాప్తి నివారణకు మార్గంగా.. పరిష్కారంగా ఉందనే ఆలోచన చేస్తుంది కేజ్రీవాల్ ప్రభుత్వం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు