టీవీ యాడ్స్ కు గడ్డుకాలం.. 2024 నాటికి డిజిటల్ రంగంవైపు మళ్లనున్న కంపెనీలు

Digital Media Overtake TV Ad Spends By 2024

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా దూసుకుపోతున్న టెలివిజన్ రంగం సంక్షోభంలో పడబోతున్నది. అంచనాలకు మించి డిజిటల్ రంగం దూసుకుపోనున్నది. 2027 నాటికి టీవీ ఇండస్ట్రీ రెవెన్యూను డిజిటల్ రంగం డామినేట్ చేస్తుందన్న వార్తలు రెండేళ్ల క్రితం వరకు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2024 సంవత్సరం నాటికే.. అంటే మరో రెండేళ్లలోనే టీవీ రంగం రెవెన్యూ భారీగా పతనం కాబోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం కరోనా.

ఏడాది కాలంగా కరోనా లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లల్లోనే ఉండిపోయారు. టీ, టిఫిన్, భోజనం, స్నాక్స్, డిన్నర్ ఇలాంటి అన్నీ ఆన్ లైన్ ద్వారానే ఆర్డర్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఊహించని విధంగా 300 శాతం పెరిగింది డిజిటల్. దీంతో పెద్ద కంపెనీలు అన్నీ తమ వ్యాపార వృద్ధి కోసం డిజిటల్ రంగం వైపు చూస్తున్నాయి. డిజిటల్ యాడ్స్ ఇవ్వటానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

మీడియా పార్టనర్స్ ఏషియా అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసింది. ఈ సర్వేలో 2020 సంవత్సరంలో టీవీ రంగానికి ఇచ్చే యాడ్స్ 27 శాతం తగ్గిపోయాయి. ఇవన్నీ కూడా డిజిటల్ వైపు వెళ్లాయి.

2021 సంవత్సరంలోనూ టీవీ రంగానికి వచ్చే యాడ్స్ 20 శాతం వరకు తగ్గనున్నాయని అంచనా వేస్తోంది మీడియా పార్టనర్స్ ఏషియా సర్వే.

ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు 2021 సంవత్సరంలో యాడ్స్ అంటే అడ్వటైజ్ మెంట్ కోసం ఖర్చు చేసే నిధుల్లో 36.6 శాతాన్ని డిజిటల్ రంగానికి ఇవ్వాలని నిర్ణయించాయి. 2024 నాటికి కనిష్టంగా 67 శాతానికి పెంచాలని ప్రణాళికలు రచించాయి.

ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఆన్ లైన్ గేమింగ్, ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ వంటి 30 రంగాల్లోని కంపెనీలు టీవీ యాడ్స్ నుంచి డిజిటల్ రంగం వేగంగా పరుగులు తీస్తున్నాయి.

2024 నాటికి ఇండియా, చైనా, కొరియా, ఇండోనేషియా, వియాత్నం, థాయ్ లాండ్ వంటి దేశాల్లో టీవీ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నది.

2020-21 సంవత్సరంలోనే పేపర్లకు వస్తున్న అడ్వటైజ్ మెంట్ల నుంచి 35 శాతం, టీవీలకు వస్తున్న యాడ్స్ నుంచి 45 శాతం రెవెన్యూను డిజిటల్ రంగం తీసుకున్నదని.. 2024 నాటికి ఇది డబుల్ కావొచ్చని మీడియా పార్టనర్స్ ఏషియా కంపెనీ వివరించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు