కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాలో ఎంటర్ అయిందా ? కేంద్ర ఏం చెబుతుంది ?

corona virus new strain in india

కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుతుందని అనుకుంటున్న నేపథ్యంలో యూకే లో బయటపడిన కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని మరోసారి అప్రమత్తం చేసింది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి 70% అధికంగా ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో భారత్ లో సైతం భాయాందోళనలు నెలకొని ఉన్నాయి. యూకే నుండి వచ్చిన కొందరి ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ భారత్ లో ఇప్పటికే ఎంటర్ అయిందంటూ ఊహాగానాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాలో ఎంటర్ అయిందా ?

కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లో ఎంటర్ అయిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో కొత్త వైరస్ జాడ ఏమాత్రం కనిపించలేదని ప్రకటించింది.

గడిచిన కొన్ని రోజుల్లో యూకే నుండి వచ్చిన ప్రయాణికుల్లో 22 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చిందని కేంద్రం ప్రకటించింది. ఇక డిసెంబర్ 22న యూకే నుండి వచ్చిన 590 మంది ప్రయాణికుల్లో వైరస్ జాడ ఉన్న వారి జీనోమ్ సీక్వెన్సింగ్ ఇంకా చేయనందున, కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ ప్రవేశించిందంటు వస్తున్న వార్తలు తప్పుని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

అయితే బ్రిటన్ నుండి వచ్చిన వారిని పూర్తిగా పరీక్షించనందున, కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఒక క్లారీటీకి రాలేనందున ప్రతి ఒక్కరు కచ్చితంగా పూర్తి స్థాయిలో స్వీయ రక్షణ చర్యలను పాటించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు