ఒకే ఆస్పత్రిలో 80 మంది డాక్టర్లకు కరోనా.. కుప్పకూలనున్న వైద్య వ్యవస్థ.. 

ఒకే ఆస్పత్రిలో 80 మంది డాక్టర్లకు కరోనా.. కుప్పకూలనున్న వైద్య వ్యవస్థ.. 

delhi
delhi

ఒకే ఆస్పత్రిలో 80 మంది డాక్టర్లకు కరోనా.. కుప్పకూలనున్న వైద్య వ్యవస్థ..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కంటే.. మించిన ప్రమాదం పొంచి ఉంది. దాదాపు రెండు నెలలుగా విరామం లేకుండా కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తున్న డాక్టర్లు ఒక్కొక్కరుగా ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. దేశ రాజధానిలో ఇప్పుడు ఇది ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

ఢిల్లీ సిటీలోని సరోజ్ ఆస్పత్రిలో 80 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఇందులో సీనియర్ సర్జన్ అయిన డాక్టర్ రావత్.. అదే ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటే కరోనాతో చనిపోయారు. మరో 12 మంది డాక్టర్లు ఆస్పత్రిలో చేరారు. మిగతా డాక్టర్లు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. సరోజ్ ఆస్పత్రిలో 80 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ రాగానే.. చికిత్స చేయటానికి డాక్టర్ల కొరత కారణంగా ఇన్ పేషెంట్ విభాగాన్ని మూసివేశారు. ఓపీలు నిలిపివేశారు.

మే ఒకటో తేదీ నుంచి అంటే.. 10 రోజుల్లోనే ఢిల్లీ వ్యాప్తంగా 300 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. ఆయా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత తీవ్రంగా తలెత్తుతోంది. నర్సులు, ఇతర వైద్య సిబ్బందిపై భారం పడుతుంది. కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన డాక్టర్లతో కంటాక్ట్ అయిన ఇతర సిబ్బంది మరో 400 మంది సైతం ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

ఢిల్లీలో వైద్యుల కొరతను అధిగమించకపోతే.. ప్రత్యామ్నాయం చూడకపోతే.. రాబోయే వారం, 10 రోజుల్లో ఢిల్లీలో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు