ఎలోన్ మాస్క్.. బిల్ గేట్స్ ను బీట్ చేశాడు.. 6 లక్షల కోట్లు సంపాదన

అంతర్జాయతీ టూరిజం చేపట్టిన మొట్టమొదటి కంపెనీగా టెస్లా నిలిచింది.

ఎలోన్ మాస్క్.. టెస్లా కంపెనీ అధిపతి. ఇప్పుడు ప్రపంచంలోనే డబ్బున్న వ్యక్తుల్లో సెకండ్ ప్లేస్ లోకి వచ్చారు. బిల్ గేట్స్ ను బీట్ చేసి లక్షల కోట్లు సంపాదించారు.
49 ఏళ్ల ఎలోన్ మాస్క్ సంపద ఎంతో తెలుసా.. 128 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో ఎంతో తెలుసా అక్షరాల 6 లక్షల కోట్ల రూపాయలు. ఇదంతా కష్టపడి, చెమటోడ్చి కాదు సంపాదించింది.. కొన్ని నెలలుగా టెస్లా కంపెనీ షేర్ విలువ స్టాక్ మార్కెట్ లో రాకెట్ లా దూసుకుపోతుంది. దీంతో అతని సంపాదన కంపెనీ ఆస్తులు అలాగే పెరిగిపోతూ ఉన్నాయి.

ఈ ఒక్క సంవత్సరమే అంటే 2020లోనే.. కరోనా టైంలోనే 4 లక్షల కోట్ల రూపాయలు సంపాదించటం విశేషం.
2020 జనవరి నెలలో ప్రపంచ కుబేరుల జాబితాలో 35వ స్థానంలో ఉండగా.. నవంబర్ నెలకు వచ్చేసరికి.. అంటే 10 నెలల కాలంలోనే సెకండ్ ప్లేస్ కు వచ్చాడు ఎలోన్ మాస్క్.

ఇటీవల ఎలోన్ మాస్క్ కంపెనీ అయిన టెస్లా కంపెనీ స్పెస్ రాకెట్ల ప్రయోగం, అంతరిక్షంలో పరిశోధనల్లో విశేషంగా రాణించింది. మంచి ఫలితాలు సాధిస్తుంది. అంతర్జాయతీ టూరిజం చేపట్టిన మొట్టమొదటి కంపెనీగా టెస్లా నిలిచింది.
టెస్లా కంపెనీ కార్లు, సోలార్ సిటీ ఇలాంటివి అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు