Etela Rajender: ఈటల రాజేందర్ తోపాటు బీజేపీలోకి మరో నేత..

Etela Rajender: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇక అందరి చూపు హుస్నాబాద్ మీదే ఉంది. మంత్రులు ఎమ్మెల్యేలు హుస్నాబాద్ లో పర్యటిస్తున్నారు. మరో వైపు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రేపు, లేదంటే శనివారం ఈటల తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తుంది. రాజీనామా అనంతరం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఈటల వెంట ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఏనుగు రవీందర్ రెడ్డి గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

టీఆర్ఎస్ పార్టీని వీడటంతో ఏనుగు రవీందర్ రెడ్డి కూడా అతడి వెంటే బీజేపీలో చేరుతున్నారు. కాగా తాజాగా ఈటల ఢిల్లీ వెళ్లిన సమయంలో ఆయన వెంట రవీందర్ రెడ్డి కూడా వెళ్లారు. ఈ నెల 14 న వీరిద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు