మాటల్లో కరోనాని మర్చిపోయామా ? 2.6 లక్షల కేసులంటే లెక్క లేదా ?

covid will never forgive any one

బీహార్ ఎన్నికలు , తెలంగాణ ఎన్నికలు , వరదలు – వర్షాలు , బోర్డర్లో గొడవలు , దసరా, రంజాన్ , దీపావళి అంటు పండుగలు, కేంద్రం పూర్తిగా ఎత్తేసిన నిబంధనలు ఇవన్ని చూసి జనం, అంటే మనం పూర్తిగా కరోనాని మర్చిపోయాం. అయితే ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా మరింతగా వ్యాపిస్తుంది అనే నిజం.

వేరే వేరే వార్తలు, పనికిరాని విషయాల్లో పడి మనం కరోనా లెక్కల్ని సరిగ్గా చూసినట్టులేం. ఎందుకంటే గడిచిన 7 రోజుల్లో భారతదేశం అక్షరాల 2.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే కాస్త దగ్గర దగ్గరగా రోజుకు 40 వేల వరకు కేసులని మాట. గతంలో కంటే తగ్గినప్పటికి – పూర్తిగా తగ్గలేదనే విషయాన్ని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికాలో ఒకే రోజు 1.6 లక్షల కేసులు

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ కరోనా కేసులు తగ్గినట్టు ప్రూవ్ కాలేదు. మన ఇండియన్స్ ఎప్పుడు జపించే అమెరికాలో అయితే  ఒక్క రోజులో ఏకంగా 1.6 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే చిన్న విషయం కాదు.

ప్రపంచంలో కొన్ని దేశాలు కరోనా కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ రావాల్సిందే అని ఫిక్స్ అయి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో అయితే వ్యాక్సిన్ వాడిన పెద్దగా ఫలితం లేక, తగిన వ్యాక్సిన్ తయారీ కోసం కష్టపడుతున్నాయి.

కరోనా పూర్తి స్థాయిలో ఇంకా తగ్గలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం మంచింది. అందరూ అనుమానిస్తున్నట్టు కరోనా సెకండ్ వేవ్ కనుక వచ్చిందంటే ఇక అంతే సంగతులు అని మర్చిపోవద్దు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నాలుగు చుక్కల శానిటైజర్ , ముక్కుకు చిన్న మాస్క్ పెట్టుకోని ఎదిరిస్తాం అంటే అది అయ్యే పని కాదు. సో… మీ పనులు చేసుకుంటూనే కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు