ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు

ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు.. పరిగెత్తండీ రో..

వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ పది రోజుల్లో కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్ అందుబాటులో తీసుకు వస్తామని.. వ్యాక్సిన్ కొరత తీరుస్తామని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అంటే.. అత్యవసరంగా 40 కోట్ల వ్యాక్సిన్స్ అవసరం అవుతాయి.. ఏప్రిల్ 17వ తేదీ నాటికి.. 90 రోజుల్లో కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు.. మే ఒకటో తేదీ నుంచి మరో 40 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వటం మొదలుపెడితే.. అందుకు తగ్గ వ్యాక్సిన్ అందుబాటులో ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ కు అర్హలని ప్రకటించిన కేంద్రం.. ఆయా రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. ప్రజలు అందరినీ సన్నద్ధం చేయాలని.. వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించింది.

విషయం తెలిసిన వెంటనే.. కుర్రోళ్లు ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ తీసుకుందామా అనే ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే.. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా సోకినా ప్రమాదం కాదు కదా.. ఇక ఎలా తిరిగినా ఇబ్బంది ఉండదని ధీమాగా ఉన్నారు.. వ్యాక్సిన్ వేస్తున్నారు.. పరిగెత్తండి రో అంటున్నారు కుర్రోళ్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు