మాజీ ప్రధానమంత్రికి కరోనా.. వెంటిలేటర్ పై చికిత్స..

మాజీ ప్రధానమంత్రికి కరోనా.. వెంటిలేటర్ పై చికిత్స..

వాళ్లు వీళ్లు అని తేడా లేదు.. అందర్నీ కరోనా వెంటాడుతోంది. సామాన్యుల నుంచి ఎంతో కట్టుదిట్టమైన భద్రత, ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం సోకుతుంది. మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.

ఆయన వయస్సు 88 సంవత్సరాలు.. వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. ఢిల్లీలో ఎయిమ్స్ లో కరోనాకు ట్రీట్ మెంట్ కోసం ఏప్రిల్ 19వ తేదీ సోమవారం జాయిన్ అయ్యారు మన్మోహన్ సింగ్.

శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో.. ఆక్సిజన్ అందిస్తున్నారు. కండీషన్ నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నా.. కొంచెం సీరియస్ అంటున్నారు. ఆరు నెలల క్రితం ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ కోసం జాయిన్ అయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం.. ఆ తర్వాత తుది శ్వాస విడిచారు.

మన్మోహన్ సింగ్ కు కరోనా అని నిర్థారణ కావటం.. ఆస్పత్రిలో జాయిన్ అయ్యారనే విషయం తెలిసిన వెంటనే.. కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ స్పందించారు. త్వరగా కోలుకుని ఇంటికి క్షేమంగా రావాలని ఆకాంక్షించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు