గోవా లాక్ డౌన్.. బీచులు మూసివేత.. టూరిజం షెట్ డౌన్..

గోవా లాక్ డౌన్.. బీచులు మూసివేత.. టూరిజం షెట్ డౌన్..

Goa government has announced a lockdown
Goa government has announced a lockdown

గోవా లాక్ డౌన్.. బీచులు మూసివేత.. టూరిజం షెట్ డౌన్..

దేశంలోనే టూరిజం డెస్టినేషన్ అయిన గోవా మరోసారి లాక్ డౌన్ అయ్యింది. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 7 గంటల నుంచి.. మే 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు గోవా రాష్ట్రం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ మహంత్.

ప్రజా రవాణా అంతా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సర్వీసులు మాత్రం నడుస్తాయని.. రాష్ట్రం నుంచి వెళ్లే వాహనాలకు అనుమతి ఉంటుందని ప్రకటించింది గోవా ప్రభుత్వం.

గోవాకు ప్రాణం అయిన టూరిజం హోటళ్లు, రిసార్టులు, కాసినోలు, బార్లు, పబ్స్, వైన్ షాపులు అన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది గోవా ప్రభుత్వం. గోవా రాష్ట్రంలోని అన్ని బీచులు మూసివేసింది ప్రభుత్వం.

ఏప్రిల్ 27వ తేదీ మంగళవారం ఒక్క రోజే గోవా రాష్ట్రంలో 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు రాగా.. 31 మంది చనిపోయారు. కేసులు పెరుగుతున్న క్రమంలో వెంటనే లాక్ డౌన్ విధిస్తే కంట్రోల్ అవుతుందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గోవాలో లాక్ డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే.. ఇతర రాష్ట్రాలు, దేశాల టూరిస్టులు అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు