Gold Illegal Transport: రహస్య ప్రదేశంలో బంగారం దాచిన ముగ్గురు మహిళలు

Gold Illegal Transport: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నప్పడికి స్మగ్లర్లు మాత్రం వారి పని వారు చేస్తున్నారు. అధికారుల ఊహలకు కూడా అందని ప్రాంతాల్లో బంగారం దోచుకొని ఎయిర్పోర్ట్ దాటిస్తున్నారు.

బంగారం అక్రమ రవాణాపై కన్నేసిన కస్టమ్స్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానం వచ్చిన వారిని వదలడం లేదు. బంగారం ఎక్కడ దాచి తీసుకొచ్చినా బయటకు తీసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇక బుధవారం షార్జా నుంచి కేరళ లోని కొచ్చిన వచ్చిన విమానంలో ముగ్గురు మహిళలు రెండు కేజీల బంగారం తమ వెంట తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుండగా అధికారులకు ముగ్గురు మహిళలపై అనుమానం వచ్చింది.

దీంతో వారిని ఆపి ప్రశ్నించారు.. తడబడటంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో వారి వ్యవహారం బయటపడింది. బంగారాన్ని పేస్టుగా మార్చి ఆ పేస్టును క్యాప్సుల్స్ లో నింపి, వాటిని మ‌ల‌ద్వారంలో దాచి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. అధికారులు బంగారం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు