Sugar పెషెంట్స్ కి గుడ్ న్యూస్ : ఇక నుండి నొప్పి లేకుండా షుగర్ పరిక్ష

pain free sugar test invented by scientist

sugar వ్యాధితో బాధపడే వారు నిత్యం sugar test లు చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. షుగర్ టెస్ట్ చేయించాల్సిన ప్రతి సారి సన్నని సూదితో గుచ్చి రక్తాన్ని బయటకు తీసి పరీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతి సారి వారు ఎంతో కొంత నొప్పిని భరించాల్సి వస్తుంది. ఎప్పుడో ఒకసారి చేయించుకునే వారి సంగతి పక్కనపెడితే, కొంత మందికి అనేక సార్లు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వారి బాధను వర్ణించడం కష్టమే.

ఇలా ప్రతి సారి సూదితో గుచ్చి పరీక్షలు చేయాల్సిన అవసరం లేకుండా, ఏ మాత్రం నొప్పి లేకుండా కేవలం నోట్లోని లాలాజలంతో షుగర్ పరీక్షను చేసుకునే ఒక కొత్త టెక్నాలజీని సైంటిస్టులు ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలోని న్యూ కాజల్ యూనివర్శీటికీ చెందిన అనేక మంది పరిశోధకులు కొన్ని సంవత్సరాలుగా వేలాది పరిశోధనలు చేసి లాలాజలంతో అది కూడా ఇంట్లో ఉండి షుగర్ పరీక్షను చేసుకోగల సాంకేతికతను కనిపెట్టారు.

ఈ సైంటిస్టులు కనిపెట్టిన ఒక చిన్న స్ట్రిప్ ( చూయింగ్ గమ్ లాంటి స్ట్రిప్ ) ను నోట్లో పెట్టుకోని కొంచెం సేపు ఉండాలి. ఈ చిన్న స్ట్రిప్ లో ఉండే కెమికల్స్ నోట్లోని లాలాజలంలో ఉన్న షుగర్ తో కలిసినప్పుడు చిన్న విద్యుత్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఆ విద్యుత్ ఛార్జ్ ఆధారంగా సదరు వ్యక్తికి షుగర్ ఏ స్థాయిలో ఉందో చెప్పడం సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఈ షుగర్ టెస్ట్ స్ట్రిప్స్ ను అనేక రకాలుగా పరీక్షిస్తున్నారు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకోని ఈ స్ట్రిప్స్ మార్కెట్లోకి వస్తే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి కొద్దిగా ఉపసమనం లభిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు