మూడు నెలల్లో లక్షకోట్లు – ఏడాది లో మూడున్నర లక్షల కోట్లు : కేంద్రం పెట్రోల్ డీజిల్ సంపాదన ఇది

indian governament collects tax on petrol

కరోనా వైరస్ దేశంలో తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికి కేంద్రప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ రూపంలో వచ్చే ఆదాయం తగ్గకపోగా 88శాతం మేర పెరిగిందని మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఈ బిజినెస్ ఏడాది అంటే 2020 ఏప్రిల్ నుండి 2021 మార్చి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఇంధనంపై ప్రభుత్వానికి 3.5 లక్షల కోట్ల రూపాయల డబ్బు టాక్స్ రూపంలో వచ్చిందని ప్రకటించారు. గత ఏడాది అంటే 2019-2020 లో ఈ ఆదాయం 1.78 లక్షల కోట్లని ఆయన వెల్లడించారు. ఇంతటి దారుణమైన కరోనా పరిస్థితుల్లో సైతం ప్రజల ముక్కుపిండి మరీ డబ్బును ప్రభుత్వం వసూలు చేసిందని చెప్పక తప్పదు.

విపరీతం పెరిగిన రేట్లు – అందుకే ఈ స్థాయి వసూళ్ళు

కరోనా సమయంలో ప్రజలు పెద్దగా ప్రయాణాలు చేయనప్పటికి ఈ స్థాయిలో ఆదాయం రావడానికి కారణం విపరీతంగా పెరిగిన ఇంధన ధరలేనని అనేక మంది భావిస్తున్నారు. గత ఏడాదిలో పెట్రోల్ పై 19.29రూపాయలుగా ఉన్న ట్యాక్స్ ను 32.9 రూపాయలకు, డీజిల్ పై ఉన్న15.83 రూపాయల ట్యాక్స్ ను 31.8 రూపాయలకు పెంచిన కారణంగా ఈ స్థాయి వసూళ్లు సాధ్యం అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కరోనా కష్ట సమయంలో సెంచరీ దాటి పరుగులు తీసిన పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం తెచ్చిపెడుతుంది.

అమ్మకాలు తగ్గాయి లేకపోతే మరింత ఆదాయం – మంత్రి ట్విస్ట్

లోక్ సభలో ప్రశోత్తరాల సందర్భంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం చెప్పిన మంత్రి పంకజ్ చౌదరి చివర్లో, కరోనా కారణంగా పెట్రోల్ , డీజిల్ అమ్మకాలు తగ్గాయి లేకపోతే మరింత ఆదాయం వచ్చేదని వ్యాఖ్యనించి షాక్ ఇచ్చారు. రేట్లు పెరుగుదలపై అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి ఉందని చెప్పిన ఆయన, ప్రభుత్వం విధించే ట్యాక్సులపై మాత్రం మాట మాట్లడలేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు