తల నరికి.. తమతో తీసుకెళ్లిన కిరాతకులు – ఇది సీమలో కాదు..

తలలేని మొండెంతో అంత్యక్రియలు చేసేది లేదని.. తల తీసుకురావాల్సిందే అని

తల నరుకుతా.. తల నరికి తెచ్చిన వాళ్లకు నా ఆస్తి ఇస్తా.. నా పిల్లనిస్తా.. ఇలాంటి డైలాగ్స్ రాయలసీమలో వింటూ ఉంటాం.. దేశంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ పగ, ప్రతీకారం సీమలో ఉందని సినిమాల్లో చూస్తూ ఉంటాం. వాస్తవంగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అది సీమలో కాదు.. తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలో. వివరాల్లోకి వెళితే..

మురుగనందం అనేది వ్యక్తం మధురైలో వ్యాపారిగా ఉన్నారు. అతను పనిపై ఇంటికి నుంచి బయటకు వచ్చారు. ఇదే సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చారు. కత్తులతో మురుగనందంపై దాడి చేశారు. తల నరికారు. కత్తి వేటుకు తల తెగి రోడ్డుపైన పడింది. ఆ తలకాయను తీసుకుని వచ్చిన కారులోనే వెళ్లిపోయారు ఇద్దరు దుండగులు

పాత కక్షలతోనే హత్య చేశారని చెబుతున్నారు పోలీసులు. దీనిపై విచారణ చేస్తున్నారు. నడిరోడ్డుపై తల నరికి.. దాన్ని తీసుకెళ్లటం సంచలనంగా మారింది.

తలలేని మొండెంతో అంత్యక్రియలు చేసేది లేదని.. తల తీసుకురావాల్సిందే అని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తలకాయ ఎక్కడ ఉందో వెతుకుతున్నాయి పోలీస్ బృందాలు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు