మూడు రాష్ట్రాలకు అతడే టార్గెట్ : పట్టిస్తే 50 లక్షల రివార్డ్

అతని కోసమే మూడు రాష్ట్రాలకు అతడే టార్గెట్ : పట్టిస్తే 50 లక్షల రివార్డ్

చత్తీస్‌గఢ్ లో జవాన్లపై జరిగిన మెరుపుదాడి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మావోయిస్టులు ఒక పథకం ప్రకారమే పోలీసులకు సమాచారం ఇచ్చి భారీ సంఖ్యలో భద్రతా దళాల్ని అడవిలోకి రప్పించుకున్నట్టు మనకు తెలిసింది. కేవలం ఒకే ఒక్క వ్యక్తి, అతని పేరు హిడ్మా అలియాస్ హిడ్మాన్న, పలాన చోట ఉన్నాడు అని సమాచారం ఇవ్వగానే దాదాపు 2 వేల మంది పోలీసులు ఏ మాత్రం ఆలోచించకుండా అడవిలోకి వెళ్లిపోయారు.ఇంతటి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న హిడ్మా అలియాస్ హిడ్మాన్న గురించి తప్పక తెలుసుకోవాల్సింది.

మూడు రాష్ట్రాలకు అతడే టార్గెట్ : పట్టిస్తే 50 లక్షల రివార్డ్

హిడ్మా అలియాస్ హిడ్మాన్న వయస్సు 40 సంవత్సరాలు. ఇతను సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి చెందిన గిరిజన వ్యక్తి. ఇతని కోసం మూడు రాష్ట్రాల పోలీసులు, జావాన్లు నిత్యం గాలిస్తూనే ఉంటారు. ఇతన్ని పట్టించిన వారికి 50 లక్షల రూపాయల రివార్డు సైతం ఉందంటే అర్థం అవుతుంది అతను ఎంతటి మోస్ట్ వాంటెడ్ అనేది. 1990ల్లోనే తిరుగుబాటు దారులతో చేతులు కలిపి హిడ్మా ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పి.ఎల్.జి.ఎ ) బెటాలియన్ కు నాయకత్వం వహిస్తున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేయడం, ఆకస్మిక దాడులు చేయడంలో ఇతను దిట్ట.

హిడ్మా అలియాస్ హిడ్మాన్న పై ఏకంగా ఎన్.ఐ.ఎ అధికారుల ఛార్జీ షీట్ సైతం నమోదు అయి ఉంది. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలోనే కాక సీపీఐ(ఎం) సెంట్రల్ కమిటీలో సైతం హిడ్మా సభ్యుడిగా ఉన్నాడు. మెరుపు దాడులు చేయడంలో దిట్ట అయిన హిడ్మా కోసం మూడు రాష్టాల పోలీసులు ఎప్పటి నుండో గాలిస్తున్నారు.

ఇంతటి కీలక వ్యక్తి కాబట్టే , పక్కా ప్లాన్ ప్రకారం మావోయిస్టులు హిడ్మా పలాన చోట ఉన్నాడనే సమాచారం పోలీసులకు చేరవేశారు. హిడ్మా మోస్ట్ వాంటెడ్ కాబట్టి అధికారులు సైతం ఏ మాత్రం ఆలోచించకుండా దాదాపు 2వేల మంది పోలీసులను అడవిలోకి పంపారు. అప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకున్న మావోలు జవాన్లను పథకం ప్రకారం చుట్టుముట్టి ఎత్తైన ప్రదేశాల నుండి దాడులు చేశారు. ఇలా ప్లాన్ ప్రకారం అంబుష్ దాడి చేయడం వల్లనే ఇంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

See also : జనవరి-జూన్‌ మధ్య కాలంలో మావోయిస్టులు దాడులు ఎందుకు చేస్తారంటే ?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు