18 నుంచి 45 ఏళ్లలోపు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి

vaccination in india 18 to 45 age

మే ఒకటో తేదీ నుంచి 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్ ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్న సంగతి పక్కన పెట్టి.. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన రిజిస్ట్రేషన్ విధానం ఎలా ఉంది.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది స్పష్టంగా తెలుసుకుందాం..

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానం ఇలా :

  1. మొదటగా మీరు www.cowin.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ “Register/Sign In Yourself” అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
  2. మీ సెల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి.. GET OTP (one-time password) క్లిక్ చేయాలి.
  3. మూడు నిమిషాల్లో మీకు OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటరన్ చేసిన తర్వాత వెరిఫైయింట్ బటన్ క్లిక్ చేయాలి.
  4. వెరిఫికేషన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫర్ వ్యాక్సినేషన్ (Registration for Vaccination) పేజీ ఓపెన్ అవుతుంది.
  5. ఈ పేజీలో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఫొటో ఐడీ ప్రూఫ్, ఫొటో ఐడీ నెంబర్, మీ పేరు, ఆడ, మగ వివరాలు, మీరు పుట్టిన సంవత్సరం కచ్చితంగా ఎంటర్ చేయాలి. ఫొటో ఐడీ కార్డు డాక్యుమెంట్ అప్ లోడ్ చేయాలి.
  6. ఈ గుర్తింపు కార్డులను మాత్రమే అనుమతిస్తారు. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, పెన్షన్ పాస్ బుక్, ఎన్ఆర్ పీ స్మార్ట్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
  7. వివరాలు అన్నీ నమోదు చేసిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ (Account Details) చూపిస్తూ.. మీ అపాయింట్ మెంట్ ను ఫిక్స్ చేసుకోండి అని డేట్స్, వారాలు చూపిస్తుంది. మీరు ఆ తేదీపై క్లిక్ చేసిన వెంటనే మీ అపాయింట్ మెంట్ కన్ఫామ్ అవుతుంది. అప్పటికే ఆ తేదీల్లో బుకింగ్ క్లోజ్ అయితే మరో తేదీని ఫిట్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
  8. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు