కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై దుమారం : అప్పట్లో 5 రూపాయలు-ఇప్పుడు 2 వేల 400 : భారత్ బయోటెక్ పై దేశవ్యాప్త విమర్శలు

huge Criticisms over bharath bio tech

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు తీసుకొచ్చిన తొలి దేశీయ వ్యాక్సిన్ లు రెండే రెండు. ఒకటి మహారాష్ట్రలోని సిరమ్ కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్.. మరొకటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్. ఇప్పుడు భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర, కంపెనీ తీరుపై విమర్శలు, ఆరోపణలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి.

2020 నవంబర్ నెలలో.. భారత్ బయోటెక్ కంపెనీ ఓ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ ధర చాలా తక్కువగా ఉంటుందని.. వాటర్ బాటిల్ ధరలో ఐదో వంతు ధరకే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అంటే ఒక్కో డోసు ధర ఐదు రూపాయలుగానే ఉంటుందని ఆ సంస్థ ఎండీ ఎల్లా కృష్ణ ప్రకటించారు. 2021, ఏప్రిల్ 21వ తేదీన ప్రకటించిన ధరలు చూస్తే షాకింగ్ కు గురి చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి 150, రాష్ట్ర ప్రభుత్వానికి 600 రూపాయలు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఒక్క డోసు ధరను 12 వందల రూపాయలకు విక్రయించనున్నట్లు ప్రకటించింది కంపెనీ.

ఇక్కడే ప్రజలు అందరికీ అనుమానాలతోపాటు విమర్శలు వచ్చాయి. ఆరు నెలల క్రితం డోసు ఐదు రూపాయలకే ఇవ్వగలం అని చెప్పిన కంపెనీ.. ఇప్పుడు ఒక్క డోసును 12 వందలకు విక్రయిస్తామని చెప్పటం ఏంటి.. ప్రజల ప్రాణాలతో.. వాళ్ల బలహీనతతో.. ప్రాణ భయాన్ని సొమ్ము చేసుకుంటుందా అనే విమర్శలు వచ్చాయి..

దీనిపై కంపెనీ ఎండీ ఎల్లా కృష్న స్పందించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని.. తయారీ, ట్రయిల్స్ విషయంలో ఎలాంటి సాయం అందలేదని ప్రకటించారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిప్పికొట్టాయి. ICMR, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సాయంతోనే వ్యాక్సిన్ తయారైందని.. ట్రయిల్స్ కు కావాల్సిన పూర్తి సాయం అందించామని స్పష్టం చేస్తూ.. 25 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని బహిర్గతం చేశాయి ఆయా సంస్థలు.

వ్యాక్సిన్ తయారీకి 350 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అని చెబుతున్న భారత్ బయోటెక్.. ప్రభుత్వం నుంచి 15 వందల కోట్ల రూపాయల ఆర్డర్ తీసుకున్నప్పుడు లాభం లేకుండా పోతుందా అనే ప్రశ్నలు అతి సామాన్యులకు వస్తున్నాయి. దీనిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయటం లేదు కంపెనీ. మరోవైపు సీరం కంపెనీ తమ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను బహిరంగ మార్కెట్ లో 600 రూపాయలకే ఇస్తాం అని ప్రకటిస్తే.. కోవాగ్జిన్ డబుల్ రేటు ప్రకటించటం ఏంటీ అనే విమర్శలు వస్తున్నాయి. దీనిపైనా కంపెనీ ప్రకటన చేయటం లేదు.

ప్రజలు, ఫార్మా కంపెనీలు, డాక్టర్లు, సామాజిక సంఘాల నుంచి వస్తున్న విమర్శలను దారి మళ్లించటానికి అన్నట్లు.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ చాలా మంచిది.. అన్ని వైరస్ లను తట్టుకుంటుంది.. కొత్తగా వచ్చిన మ్యూటేషన్లను సైతం ఎదుర్కొంటుంది అంటూ తమ అనుకూల మీడియాలో పత్రికల్లో.. తమ సామాజిక వర్గాలకు చెందిన మీడియాలో పదేపదే ప్రకటన ఇప్పిస్తుంది.. తెలుగు ప్రజలు అంటే నమ్ముతారు.. మరి జాతీయ మీడియాకు ఏమని సమాధానం చెబుతుంది భారత్ బయోటెక్ అనేది ఇంట్రస్టింగ్ పాయింట్.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ అద్భుతం అని చెబుతుంది కంపెనీ.. మరి కోవిషీల్డ్ బాగోలేదని ఈ మీడియా చెప్పగలదా.. ఈ ప్రభుత్వాలు ఆ వ్యాక్సిన్ ను బ్యాన్ చేయగలవా అంటున్నారు ప్రజలు.

కరోనా సంక్షోభ సమయంలో.. ప్రజలు బతుకుతామో లేదో అన్న ఇలాంటి సమయంలోనూ తెలుగు మీడియా వ్యవహరిస్తున్న తీరు చూసి నవ్వుకోవటం కాదు.. అంతకు మించి మాట్లాడుకుంటున్నాయి జాయతీ, అంతర్జాతీయ మీడియా.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు