దేశంలో కొత్త వ్యాపారం : స్మశానాల వద్ద బారులు తీరిన వ్యాపారులు

huge demand for last rituals makers

ఖర్మ భూమి.. పుణ్య భూమి.. వేద భూమి అంటూ భారతదేశాన్ని కీర్తిస్తాయి ప్రపంచ దేశాలు.. కరోనా టైంలోనూ ఇలాగే కీర్తిస్తున్నాయి.. కొత్త వ్యాపార సూత్రంతో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అంటున్నారు. పెళ్లికి కావాల్సిన అన్ని వస్తువులు.. అదేనండీ వెడ్డింగ్ డెస్టినేషన్ లా.. ఇప్పుడు వన్ స్టాప్ అంత్యక్రియలు అంటూ ఉత్తరప్రదేశ్ లో వ్యాపారం మొదలైంది..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ నగరంలోని చౌక్ ఏరియాలో.. అంకిత్ అగర్వాల్ అనే వ్యాపారి.. నిన్నటి వరకు వన్ స్టాప్ వెడ్డింగ్ డెస్టినేషన్ అనే వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నాడు. 15 ఏళ్లుగా ఎంతో సంపాదించాడు.. 50 మందికి ఉపాధి కల్పించాడు. ఏడాది కాలంగా కరోనాతో పెళ్లిళ్లు తగ్గిపోయాయి.. వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది అనుకుంటున్న క్రమంలో.. కరోనా సెకండ్ వేవ్ వల్ల మరింత నష్టాల బారిన పడ్డాడు అంకిత్ అగర్వాల్.

ఉత్తరప్రదేశ్ లో కరోనా మరణాలు.. అందులోనూ ప్రయాగ్ రాజ్ లో జనం కరోనాతో పిట్టల్లా రాలిపోతున్నారు. అంటే వెంటనే వ్యాపారం రూటు మార్చాడు. అంత్యక్రియలకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ దొరకబడును అని బోర్డు పెట్టాడు. పూలు, వస్త్రాలు, కట్టెలు, పాడెకు కావాల్సిన కర్రలు, యోయటానికి మనుషులు, మాస్కులు, శానిటైజర్లు, వాహనాలు.. ఇలా అన్నింటినీ అమ్ముతున్నాడు. పది రోజులుగా వ్యాపారం బాగా జరుగుతుంది అంటున్నాడు.

ఒకప్పుడు పెళ్లిళ్లకు డెస్టినేషన్ మా షాపు.. ఇప్పుడు చావులకు డెస్టినేషన్ గా మారిపోయింది. కాలం చాలా విచిత్రమైంది.. ఏదో విధంగా బతకాలి కదా.. అందులోనూ ప్రజలకు ఏది ముఖ్యమో అదే కావాలి కదా.. ఇప్పుడు ప్రజలు అంత్యక్రియలకు కావాల్సిన వస్తువుల కోసం వెతుకుతున్నారు.. వాటినే అమ్ముతున్నాను అంటున్నాడు..

ప్రయాగ రాజ్ లో ఉన్న రెండు షాపులను ఇప్పుడు అంతిమ యాత్రకు కావాల్సిన వస్తువుల విక్రయంగా మారిపోయింది అంటున్నాడు. కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లు.. కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్న మాట.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు