దేశంలో కొత్తగా లక్ష ఆరువేల కేసులు నమోదు. గత రెండు నెలల్లో ఇదే అతి తక్కువ.

దేశంలో నిన్న కొత్తగా లక్ష ఆరువేల కేసులు నమోదు అయ్యాయి ముందు రోజు కన్నా 12 శాతం తక్కువ కేసులు నమోదు అయ్యాయి. గత రెండు నెలల్లో ఇంత తక్కువ కేసులు నమోదు అవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వున్నా యాక్టీవ్ కేసుల సంఖ్య 2.89 కోట్లు.

దేశంలో పోసిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతానికి 100 కి 6.33 శాతంగా పోసిటివిటీ రేటు వుంది. గత 14 రోజులుగా దేశంలో పోసిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ నమోదు అవుతుంది.

దేశంలో ఇప్పటి వరకు 23 కోట్ల టీకా డోసులు ఇచ్చారు (మొదటి డోసు మరియు రెండో డోసు కలిపి) కానీ ఇంకా టీకా కొరత మాత్రం తగ్గలేదు. దేశ రాజధాని ఢిల్లీలో కావాక్సీన్ స్టాక్ అయిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులు మరియు నర్సింగ్ హోమ్ లకి మొదటి డోస్ కావాక్సీన్ కి వచ్చేవారికి టీకా వేయవద్దు అని ఆదేశించింది.

ఇప్పటికే ఢిల్లీ మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లాక్ ప్రక్రియ మొదలు పెట్టగా,తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మరియు గోవా రాష్ట్రాలు జూన్ 14 వరకు లాక్ డౌన్ ను పొడిగించాయి తాజాగా ఈ జాబితాలోకి హర్యానా,సిక్కిం రాష్ట్రాలు చేరాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు