2024 ఎన్నికల్లో ఈ-ఓటింగ్ విధానం -ఇంట్లో కూర్చోనే ఓటు వేయవచ్చా…?

2024 ఎన్నికల్లో ఈ-ఓటింగ్ విధానం -ఇంట్లో కూర్చోనే ఓటు వేయవచ్చా...?

ఎన్నికలు అంటే భారతదేశంలో ఓ పెద్ద ప్రహాసనం.. అందు కోసం సెలవు తీసుకోవాలి. ప్రభుత్వాలు సెలవు ప్రకటిస్తాయి. వ్యక్తిగతంగా హాజరయ్యి ఓటు వేయాలనే నిబంధనతో ఇతర ఊర్లలో.. విదేశాల్లో ఉన్న భారతీయులు ఓటు వేయటానికి వీలు లేకుండా పోతుంది. దీని వల్ల ఓటింగ్ శాతం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నది.

2024 ఎన్నికల్లో ఈ-ఓటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది భారత ఎన్నికల సంఘం. అంతకంటే ముందుగానే.. ప్రతి ఓటరు.. తన ఓటును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్న ఓటుతో.. ఎక్కడి నుంచైనా ఓటు వేసే అవకాశాన్ని కల్పించనుంది ఎన్నికల సంఘం.

ఈ-మెయిల్ ద్వారా ఓటు వేయవచ్చు లేకపోతే వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటు వేయవచ్చు.. ఎన్నికల సంఘం యాప్ లోకి వెళ్లి ఓటు వేయవచ్చు. దీన్ని ఈ-ఓటింగ్ అంటారు. అందరికీ ఇది సాధ్యం కాదు.. కేవలం ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్న ఓటర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికల్లో కొన్ని పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ-ఓటింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం దేశంలో 4జీ టెక్నాలజీ అందుబాటులోకి రావటంతోపాటు.. ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం ఉంది.

ఈ-ఓటింగ్ విధానం ద్వారా దొంగ ఓట్లు, రెండు ప్రాంతాల్లో ఓట్లు వేయటం వంటివి ఉండవని.. ఎంతో పారదర్శకత ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో టెక్నాలజీ ద్వారా ఓటు వేయటం ఖాయం…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు