రంగంలోకి దిగిన సైన్యం : దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు..

కరోనా సునామీపై యుద్ధానికి సైన్యం.. తాత్కాలిక ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు..

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్.. సునామీపై విరుచుకుపడుతుంది.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. త్రివిధ దళాల చీఫ్ లతో సమావేశం అయ్యింది. కరోనాపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని మోడీ ఆదేశించారు.

ఢిల్లీలో కరోనా బెడ్స్ కొరతను తీర్చేందుకు ఆర్మీ ఆస్పత్రులను కోవిడ్ సెంటర్లుగా మార్చటానికి సిద్ధం అయ్యింది ఆర్మీ. సైన్యంలోని డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అంతా కరోనా రోజులకు ట్రీట్ మెంట్ చేయటానికి రెడీ అయ్యారు.

తేజాస్ యుద్ధ విమానాల్లో ఉపయోగించే టెక్నాలజీ.. LAC (లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) ద్వారా ఆధునీకరించటం ద్వారా.. నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సీజన్ ఉత్పత్తి చేసి.. ఆక్సిజన్ కొరత ఉన్న అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయాలని నిర్ణయించింది ఆర్మీ.

ఏయే రాష్ట్రాల్లో అయితే ఆక్సిజన్ ప్లాంట్స్ అవసరమో.. ఆయా ఆస్పత్రుల దగ్గర యుద్ధ ప్రాతిపదికన ప్లాంట్స్ ఏర్పాటు చేయటానికి DRDO, సైన్యంలో టెక్నికల్ విభాగం, వైద్య విభాగం రంగంలోకి దిగుతుంది.

కేసులు తీవ్రంగా ఉండి.. బెడ్స్ లేక ఇబ్బంది పడుతున్న రాష్ట్రాల్లో ఆర్మీ ఆధ్వర్యంలో తాత్కాలిక క్యాంప్స్ ఏర్పాటు చేయటం ద్వారా పరిస్థితిని చక్కదిద్దటం.

కోవిడ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరా, ఆక్సిజన్ సరఫరా నిరంతరాయంగా జరిగే విధంగా ఆర్మీ సహకారం తీసుకుంటుంది కేంద్రం.

లక్నో, పాట్నా, వారణాసి, అహ్మదాబాద్ నగరాల్లో రాబోయే వారం రోజుల్లో 250 నుంచి 500 బెడ్స్ ఉన్న తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించాలని నిర్ణయం.

ఆయా రాష్ట్రాల డిమాండ్, కేసుల సంఖ్య, తీవ్రత దృష్ట్యా ఆర్మీ సహాయ సహకారాలు అందించాలని రక్షణ శాఖను ఆదేశించారు ప్రధానమంత్రి మోడీ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు