కరోనా కోచ్ లు వచ్చేశాయి.. ఇక నుంచి కావాల్సినన్ని బెడ్స్.. కూలర్లు కూడా పెట్టారు..

indian railways introduce corona coaches

దేశంలో కరోనా రోగుల చికిత్స కోసం ఏ ఆస్పత్రిలోనూ బెడ్స్ లేవు అనే సమాధానం వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ కోసం లక్షలకు లక్షలు దోపిడీ జరుగుతుంది. దీన్ని అరికట్టేందుకు.. రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన రైల్వే కోచ్ ల్లో కరోనా బెడ్స్ సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 4 వేల కోచుల్లో 64 వేల బెడ్స్ అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించింది.

దేశంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లోని ఆయా రైల్వే స్టేషన్లలో బెడ్స్ ఉన్న బోగీలను సిద్ధం చేసింది రైల్వే శాఖ. ప్రతి బోగీకి ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేసింది. ఎండాకాలం కావటంతో బోగీలపై గోతాల పట్టలు కప్పింది. చల్లదనం కోసం కూలర్లతోపాటు.. విడిగా ఫ్యాన్లు ఏర్పాటు చేసింది.

బెడ్స్ తోపాటు ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లను సైతం రైలు బోగీల్లోని వార్డుల్లో ఏర్పాటు చేసింది. రోగులకు ట్రీట్ మెంట్ కోసం రైల్వే శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించింది. నిత్యం శానిటైజ్ చేస్తుంది. రోగులకు ఆహారం అందించటానికి రైల్వే స్టేషన్లలోని ప్యాంటీ కార్లు, ఇతర ఫుడ్ కాంట్రాక్టర్లను సిద్ధం చేసింది. డాక్టర్ల సూచన మేరకు ఆయా ఆహార పదార్థాలను టైం ప్రకారం అందిస్తామని ప్రకటించింది రైల్వే శాఖ.

కరోనా తీవ్రంగా ఉండి.. ఆస్పత్రుల్లో బెడ్స్ లేని నాలుగు రాష్ట్రాల్లో 64 వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని.. మిగతా రాష్ట్రాల డిమాండ్ కు తగ్గట్టు.. ఆయా రైల్వే స్టేషన్లలో బెడ్స్ బోగీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది రైల్వే శాఖ..

కరోనా వచ్చిందని.. బెడ్స్ దొరకటం లేదని బాధ పడకండి.. కావాల్సినన్ని బెడ్స్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి.. డోంట్ వర్రీ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు