జస్ట్ 15 నిమిషాల్లో.. 7 లక్షల కోట్లు పోయాయి – మండే మటాష్.. మనలాంటోళ్లు నాశనం అయ్యారు..

జస్ట్ 15 నిమిషాల్లో.. 7 లక్షల కోట్లు పోయాయి - మండే మటాష్.. మనలాంటోళ్లు నాశనం అయ్యారు..

stock market crash
stock market crash

జస్ట్ 15 నిమిషాల్లో.. 7 లక్షల కోట్లు పోయాయి – మండే మటాష్.. మనలాంటోళ్లు నాశనం అయ్యారు..

అదో మాయ ప్రపంచం.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు.. ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుంది.. ఎప్పుడు ముంచుతుందో దేవుడికి తెలియదు కానీ.. అందులోని బడా పారిశ్రామికవేత్తలకు బాగా తెలుసు.. అదే స్టాక్ మార్కెట్..

ఏప్రిల్ 12వ తేదీ సోమవారం.. శుభమా అంటూ స్టాక్ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టినోళ్లు అందరూ నాశనం అయ్యారు. జస్ట్ 15 నిమిషాల్లో 7 లక్షల కోట్ల రూపాయల సందప ఆవిరి అయ్యింది.

ఉదయం 9.30 గంటలకు 202 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న స్టాక్ మార్కెట్ వాల్యూ.. 9 గంటల 45 నిమిషాలకు.. 195 లక్షల కోట్లకు పడిపోయింది.

బ్యాంకింగ్ రంగంలోని షేర్లు బాగా నష్టపోయాయి. ఆటో షేర్లు చాలా స్వల్పంగా లాభపడ్డాయి. మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లు కనీసం 3 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంతలా పడిపోతుందని ఊహించని పెట్టుబడిదారులు.. జరుగుతున్న పరిణామాలతో మరింత కంగారు పడి.. అమ్మకాలకు దిగారు. ఇది మరింత నష్టాలను తీసుకొచ్చింది. రోజువారీగా లావాదేవీలు నిర్వహించే చిన్న, మధ్య తరగతి పెట్టుబడిదారులు.. భారీ ఎత్తున తమ షేర్లను అమ్మకానికి పెట్టటంతో.. పరిస్థితి మరింత దిగజారిపోయింది.

స్టాక్ మార్కెట్ ఉన్నట్లు ఉంది.. మండే రోజు ఎందుకు పడిపోయింది అంటే.. ఒకే ఒక్క కారణం. అది లాక్ డౌన్. దేశంలో రోజువారీగా నమోదు అవుతున్న కరోనా కేసులు లక్షా 50 వేలకు చేరింది. దేశవ్యాప్తంగా ఉధృతంగా ఉంది. మహారాష్ట్ర, యూపీ, ఉత్తరాఖండ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పాక్షిక ఆంక్షలు విధించారు. రాత్రి కర్ఫ్యూకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ లేదా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిందన్న వార్తలతో.. పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవటానికి ఒక్కసారి ఎగబడ్డారు.. దీంతో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్.. భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది.

నెల రోజులుగా లాభాలు తీసుకున్న వారు.. మండే రోజు ఆ లాభం మొత్తాన్ని కోల్పోయారు. ఒపిక పట్టినోళ్లకు మట్టే మిగిలింది. ఇంకా లాభం వస్తుంది అట్టిపెట్టుకున్నవారు.. ఇప్పుడు నష్టాలను మూటగట్టుకున్నారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు