ఒక్క రోజులోనే 4 లక్షల కేసులు.. 4 వేలకు దగ్గరలో మరణాలు.. కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన భారత్..

covid cases in india are at worest hit

భారతదేశం కరోనా వృద్ధి కొత్త రికార్డులు బద్దలు కొడుతుంది. ఏప్రిల్ 28వ తేదీ బుధవారం ఒక్క రోజే 3 లక్షల 80 వేల కొత్త పాజిటివ్ కేసులు బయడపడ్డాయి. 3 వేల 600 మంది కరోనాతో చనిపోయారు. ఇది జస్ట్ 24 గంటల రికార్డ్.. ఈ లెక్కలతో.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటిపోయింది.

పాజిటివ్ రేటు 10 శాతం దాటిపోగా.. చావుల శాతం 1.11శాతంగా ఉంది. నాలుగు రోజుల క్రితం ఇది కేవలం ఒక్క శాతంగా ఉంటే.. ఇప్పుడు పాయింట్ 11 శాతం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం 17 లక్షల 68 వేల 190 మందిని పరీక్షించగా.. 3 లక్షల 80 వేల కేసులు బయటపడ్డాయి. రికవరీ రేటు 82శాతంగా ఉంది.. రోజులు గడిచే కొద్దీ వేగంగా కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం.

కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నా.. అదే స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగటం లేదు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. ఇది కూడా ఒక డోసు మాత్రమే. 130 కోట్ల మందికి ఇదే విధంగా వ్యాక్సిన్ వేసుకుంటూ పోతే.. నాలుగేళ్లు పడుతుంది అంటున్నారు వైద్యులు. దేశానికి అత్యవసరంగా 260 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉంటేనే.. సురక్షితంగా బయటపడతాం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు