కమల్ ఫ్రస్టేషన్ : ఎన్నికల ప్రచారంలో సొంత గుర్తు టార్చ్ లైట్ విసిరి కొట్టిన కమల్ హాసన్

టార్చ్ బేరర్ అనుకుంటే.. టార్చ్ లైట్ కూడా వెలగటం లేదు

మక్కల్ నీది మయ్యం పార్టీ పేరుతో తమిళనాడు ఎన్నికల్లో పోటీకి దిగిన ఆ పార్టీ అధినేత కమలహాసన్.. తన ఎన్నికల గుర్తుపై అసహనంగా ఉన్నారు. ఔట్ డేటెడ్ అయిన టార్చ్ లైట్ ఇవ్వటం ఏంటని రుసరుసలాడుతున్నారు. ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ చూపించటానికి కూడా దొరకటం లేదని.. ఎవరూ అమ్మటం లేదని గుర్రుగా ఉన్నారు.

టార్చ్ లైట్ అంటే సెల్ ఫోన్ లో టార్చ్ వేస్తున్న రోజుల ఇవి.. ఇక టార్చ్ లైట్స్ ఎవరు అమ్ముతున్నారు అంటున్నారు కార్యకర్తలు, నేతలు. ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తు కేటాయించిన వెంటనే.. సుమారు లక్ష టార్చ్ లైట్స్ కొనాలని డిసైడ్ అయ్యారంట.. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇన్ని టార్చ్ లైట్స్ అందుబాటులో లేవంట.

దీంతో మార్కెట్ లో ఉన్నవే కొనుగోలు చేసిన కమలహాసన్ ఎన్నికల సిబ్బంది.. ప్రచారంలో భాగంగా టార్చ్ లైట్ చూపిస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. మార్చి 31వ తేదీ బుధవారం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సౌత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. టార్చ్ లైట్ చూపిస్తూ.. దాన్ని వెలిగించాడు. అయితే అది వెలగలేదు. ఈ ఘటనతో ప్రస్టేషన్ కు గురయిన కమలహాసన్.. తన పార్టీ ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ ను కింద కు విసిరివేయటం వీడియోలో రికార్డ్ అయ్యింది.

అప్పటికే ఎన్నికల గుర్తు కేటాయింపుపైనే గుర్రుగా ఉన్న ఈ సినీ పొలిటికల్ లీడర్.. ఆ గుర్తుగా వచ్చిన టార్చ్ లైట్ సైతం వెలగకపోవటంతో మరింత అసహనానికి గురవుతున్నారంట.. తమిళనాడుకు టార్చ్ బేరర్ అనుకున్నారు.. టార్చ్ లైట్ కూడా వెలగటం లేదు అంటూ ప్రత్యర్థి పార్టీలు చురకలు అంటిస్తున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు