డీఎంకే పార్టీలో చీలిక – అళగిరి కొత్త పార్టీ – బీజేపీ బ్యాక్ సపోర్ట్ – రొంబ సస్పెన్స్

ఓట్ల చీలిక ద్వారా డీఎంకేను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

తమిళనాడు రాజకీయాలు అంటేనే చాలు.. హైపర్ యాక్టివ్ గా ఉంటాయి.. విషయం ఏదైనా బీభత్సం కామన్. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నయ్య అళగిరి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే.. నవంబర్ 21వ తేదీన చెన్నై వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అపాయింట్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యింది.

డీఎంకే పార్టీలోనే సొంత కుంపటి పెట్టి పార్టీకే తలనొప్పిగా మారిన అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు తండ్రి కరుణానిధి. అప్పటి నుంచి మధురై ప్రాంతానికే పరిమితం అయ్యారు.
అళగిరి పెట్టబోయే పార్టీ పేరు ఏంటో తెలుసా.. కళైంగర్ ద్రవిడ మున్నెట్ర కజగంగా అని రిజిస్టర్ చేయించారు.

రాబోయే ఎన్నికల్లోనే బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు అళగిరి.
ఈ పరిణామాలు డీఎంకే పార్టీలో చీలిక తెచ్చేలా ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. గత ఎన్నికల్లోనే మధురై ప్రాంతంలో అళగిరి వల్ల పార్టీకి నష్టం వచ్చింది. దీంతో ఓడిపోయింది. మళ్లీ జయలలిత సీఎం అయ్యింది.

అళగిరి కొత్త పార్టీపెడితే.. డీఎంకేలోని కొంత మంది అటువైపు వెళ్లే అవకాశం ఉంది. ఓట్ల చీలిక ద్వారా డీఎంకేను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు