Police Officer Wife: పోలీస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి.

Police Officer Wife: ఆయనో పోలీస్ అధికారి.. మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో అడిగినంత కట్నం ఇచ్చారు. అది సరిపోలేదని ప్రతి రోజు భార్యను చిత్ర హింసలకు గురించేసేవాడు. ఈ సమయంలోనే భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన కిరణ్ కుమార్ అనే పోలీస్ అధికారికి, విస్మయ నాయర్ అనే యువతితో 2020 మే నెలలో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో బంగారం, నగదు తోపాటు, కారు, స్థిరాస్తులు ఇచ్చారు.

అయితే అవి చాలని కిరణ్ కుమార్ భార్య విస్మయను వేధించడం మొదలు పెట్టాడు. తనకు పది లక్షల నగదు కావాలని మీ తండ్రిని అది తేవాలని వేధించేవాడు. అనేక సార్లు కొట్టేవాడు. బంధువులు, తల్లిదండ్రులతో మాట్లాడకూడదని షరతు పెట్టాడు. ఆమె దగ్గర ఫోన్ లేకుండా చేసి చిత్ర హింసలకు గురిచేశాడు.

ఎలాగోలా ఫోన్ సంపాదించిన విస్మయ తన శరీరంపై ఉన్న దెబ్బలను ఫోటోలు తీసి కుటుంబ సభ్యులకు పంపింది. దీంతో వారు చలించిపోయారు. తమ కూతురిని పుట్టింటికి పంపాలని తల్లిదండ్రులు కిరణ్ కుమార్ ను కోరారు. అయితే అందుకు తాను ఒప్పుకోలేదు. ఇది జరిగిన కొద్దీ రోజులకే విస్మయ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రస్తుతం ఈమె మృతి కేరళ ప్రకంపనలు సృష్టిస్తుంది.

ఇక ఈ విషయంపై విస్మయ తండ్రి మాట్లాడుతూ.. భర్త కిరణ్ కుమార్ తన కూతురిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించించాడని తెలిపారు. తన కూతురు BAMS ఫైనల్ ఇయర్ చదువుతుందని, పరీక్షలు ఉన్నాయని తమ ఇంటి వద్ద ఉంటే, కిరణ్ కుమార్ బలవంతంగా తీసుకెళ్లాడని ఆమె తండ్రి వాపోయారు. మొదట అతడికి కారు పెట్టామని.. అది తనకు నచ్చలేదని అనేక సార్లు తన కూతురితో గొడవ పడ్డాడని, కారు వద్దంటూ పది లక్షలు డబ్బు కావాలని వేధించాడని తెలిపారు.

ఈ సమయంలోనే తన కూతురిని హత్యచేశారని కిన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై మొదట పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు రాజి కుదిర్చే ప్రయత్నం చేశారని, గొడవ చేయడంతో కేసు నమోదు చేసుకొని కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలు తండ్రి పోలీసులను వేడుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అర్దాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు