వెరైటీ కేకులు అమ్ముతున్న కలకత్తా బేకరీ – అదిరిపోయే సేల్స్ తో దూసుకెళ్తున్న రాజకీయ కేకులు

kolkata based backer sells cackes

క్రిస్మస్ పర్వదినాన్ని  క్రిస్టియన్ సోదరసోదరీమణులు కేకులు కట్ చేసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇలాంటి క్రిస్మస్ కేకులకి పొలిటికల్ టచ్ ఇచ్చి సేల్స్ ని అమాంతం పెంచేసుకుంది కలకత్తాకు చెందిన ఓ పియాలి సర్కార్ అనే మహిళ.

ప్రజల్లో ఉండే రాజకీయ ఆసక్తికి కేక్ రూపం ఇచ్చిన పియాలి సర్కార్, కేకులపై రాజకీయ పార్టీల సింబల్స్ ని ముద్రించి అమ్మకాలు ప్రారంభించింది.క్రిస్మస్ పర్వదినంతో పాటు త్వరలో పశ్చిమ బెంగాళ్ లో ఎన్నికలు సైతం జరగనున్న నేపథ్యంలో అనేక మంది వీరి కేకులను కొంటున్నారు.

కాంగ్రెస్, బీజేపీ, తృణముల్ కాంగ్రేస్ , సీపీఐ, సీపీఎం వంటి అన్ని ప్రముఖ పార్టీల గుర్తులతో పాటు స్థానిక పార్టీల గుర్తులతో సైతం ఈ కేకులను తయారు చేయడంతో , రాజకీయ ఆసక్తి ఉన్నవారు ఆయా పార్టీల కార్యకర్తలు ప్రత్యేక ఆసక్తితో ఈ కేకులను కొనుక్కుంటున్నారు.ఇక కేకుల అమ్మకాలు సైతం ఫుల్ జోష్ లో ఉన్నాయని పియాలి సర్కార్ వెల్లడించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు