చిరుత పులికి కరోనా పాజిటివ్

జంతువులకు కరోనా రావటంతో రెండు జూలను మూసివేశారు. వాటికి ప్రత్యేక కేర్ టేకర్ ను నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాటికి ఇచ్చే ఆహారంలో కరోనా నివారణ మందులు...

leopard at Kentucky zoo tests covid-19 positive
leopard at Kentucky zoo tests covid-19 positive

అమ్మో పులి అంటాం.. చిరుత మాట వింటేనే వణికిపోతాం.. అలాంటి పులి ఇప్పుడు కరోనాను చూసి వణికిపోతుంది. ఇది అక్షర సత్యం.. అమెరికాలోని కెంటుకీ జూ లో ఉన్న మంచు చిరుత పులికి కరోనా వైరస్ సోకినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ నేషనల్ వెటర్నటీ సర్వీసెస్ ల్యాబోరేటరీస్ అధికారికంగా ప్రకటించింది.

మూడు రోజులుగా చిరుత చాలా డల్ గా ఉందని గుర్తించిన అధికారులు వైద్య పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ జంతువుకు కరోనా పాజిటివ్ రావటంతో అమెరికాలో ఇదే ఫస్ట్.

కెంటుకీ జూలో చిరుతపులికి కరోనా వచ్చిన విషయం తెలిసిన తర్వాత.. లూయిస్విల్లే జూలోని చిరుతలకు పరీక్షలు నిర్వహించగా మరో పులులకు కరోనా సోకినట్లు తేల్చారు. ప్రస్తుతం మూడు చిరుత పులులు కరోనా నుంచి కోలుకుంటున్నాయని స్పష్టం చేశారు.

జంతువులకు కరోనా రావటంతో రెండు జూలను మూసివేశారు. వాటికి ప్రత్యేక కేర్ టేకర్ ను నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాటికి ఇచ్చే ఆహారంలో కరోనా నివారణ మందులు కలిపి ఇస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం అంటున్నారు. కరోనా సోకిన మంచు చిరుత పులులు బయటకు రాకుండా బోనులోనే ఉంచుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు