అసోం – మిజోరాం రాష్ట్రాల మధ్య గొడవలు : పోలీస్ కాల్పులు – విధ్వంసం

ఓ ట్రక్ డ్రైవర్ ను కొట్టి.. ఇళ్లు, షాపులకు నిప్పు పెట్టారని గొడవకు

గొడవలు, ఘర్షణలతో ఆ రెండు రెండు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్. అవును నిజం.. అసోం ప్రభుత్వం అనుమతి లేకుండా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కరోనా టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చసింది మిజోరాం రాష్ట్రం. మిజోరాం రాష్ట్ర అధికారుల వైఖరితో.. అసోం రాష్ట్ర ప్రజలు భగ్గుమన్నారు. యువత పెద్ద సంఖ్యలో సరిహద్దు గ్రామాలకు తరలివచ్చింది. అసోం సరిహద్దు గ్రామంలో అలజడి సృష్టించారు మిజోరాం యువకులు. పరిస్థితులు అదుపు చేసేందుకు అసోం రాష్ట్ర పోలీసులు కాల్పులు జరిపారు.

దీనిపై రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. మిజోరాం యువకులే మా రాష్ట్రంలోని గ్రామానికి నిప్పు పెట్టారని ఆరోపిస్తోంది. దీన్ని ఖండించింది అసోం. అసోం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కరోనా టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసింది అని చెబుతుంది.

స్థానికులు చెబుతున్న కథనం మరోలా ఉంది. మిజోరాంకు చెందిన యువకులు అసోంలోకి వచ్చి లైలా గ్రామంలోకి వచ్చి ఓ ట్రక్ డ్రైవర్ ను కొట్టి.. ఇళ్లు, షాపులకు నిప్పు పెట్టారని గొడవకు కారణం ఇదే అంటున్నారు స్థానికులు. అధికారులు, స్థానికుల వెర్షన్ ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం రెండు రాష్ట్ర సరిహద్దుల దగ్గర రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు