ఇండియాలో మరోసారి లాక్ డౌన్ : మే 3 నుండి జూన్ 2 వరకు : లీటర్ పెట్రోల్ 120

once again lock down in india

దేశంలో కరోనా అంతకంతకూ వ్యాపిస్తూ.. రోజు వారీ కేసుల సంఖ్య 2 లక్షల 17 వేలకు చేరింది. డెత్ రేటు క్రమంగా పైకి వెళుతుంది. ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ అనే వార్తలు వస్తున్నాయి. మే 2వ తేదీ దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయని.. ఆ తర్వాత లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  మే 3వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు 30 రోజులు లాక్ డౌన్ ఉంటుందని.. దాంతోనే కరోనా కట్టడి అవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. దీనిపై జోరుగా బెట్టింగ్స్ సైతం జరుగుతున్నాయి.

ఈసారి లాక్ డౌన్ పెడితే.. లీటర్ పెట్రోల్ 120 రూపాయలకు చేరటం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో చిన్నాభిన్నం అయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు.. ప్రభుత్వం ఆదాయ మార్గంగా లీటర్ పెట్రోల్ పై ఏకంగా 37 రూపాయలు పెంచుకుంటూ వెళ్లింది. ఇప్పుడు లీటర్ పెట్రోల్ 94 రూపాయలుగా ఉంది.

ఈసారి లాక్ డౌన్ పెడితే.. ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా.. పెట్రోల్ పై మరింత బాదుడు ఖాయంగా కనిపిస్తుంది. లాక్ డౌన్ లో అన్నీ వ్యాపారాలు బంద్ అవుతాయి. నిత్యావసరాలు, అత్యవసర సర్వీసులు మాత్రమే ఉంటాయి. వీటి రవాణాకు కావాల్సింది పెట్రోల్, డీజీల్.. ప్రభుత్వానికి ఆదాయం కూడా దీనిపైనే వస్తుంది. మరో మార్గం లేదు.. గత్యంతరం లేదు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి లాక్ డౌన్ విధిస్తే.. పెట్రోల్ రేటు 120 రూపాయలకు చేరటం ఖాయం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. దీనికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారని.. 65 రూపాయల పెట్రోల్ రేటు.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 95 రూపాయలు అయ్యింది.. అంగీకరించారు.. అర్థం చేసుకున్నారు.. మళ్లీ లాక్ డౌన్ పెడితే ఆ మాత్రం అర్థం చేసుకోరా ఏంటీ అంటున్నారు.

లాక్ డౌన్ విధించటం వల్ల ప్రభుత్వానికి ఒకే ఒక్క ఆదాయ మార్గం ఉంటుంది.. అది పెట్రోల్, డీజిల్ అమ్మకం ద్వారా వచ్చే పన్ను. గత లాక్ డౌన్ లో 37 రూపాయలు పెంచటం వల్ల గట్టెక్కిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈసారి అదే మార్గాన్ని అన్వేషించటంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు అంటున్నారు.

See also : అది కుంభ మేళా కాదు.. కరోనా మేళా.. 130 మంది సాధువులకు పాజిటివ్.. యూపీలో విలయతాండవం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు