రానున్న 48గంటలు ఎంతో కీలకం – మాట వినకపోతే లాక్ డౌన్ తప్పదు – ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

రానున్న 48గంటలు ఎంతో కీలకం - మాట వినకపోతే లాక్ డౌన్ తప్పదు - ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ తాక్రే శుక్రవారం నాడు ప్రజలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా విషయంలో కేవలం ప్రజల అజాగ్రత్త చర్యల వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నఆయన, రానున్న 48 గంటల్లో ఎక్కడి వారు అక్కడ ఉంటూ ప్రయాణాలను తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

అత్యవసరం అయితే బయటకు రండీ లేకపోతే ఇంట్లోని కూర్చోండి, బయటకు వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోండి, అంటూ హెచ్చరించారు. 48 గంటల్లో పరిస్థితిలో ఏ మార్పు రాకపోయినా,ప్రజలు లెక్కలేని తనంగా వ్యవహరించిన గతంలో విధించినట్టు కఠినమైన లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని వెల్లడించారు.

ప్రస్తుతం మాహారాష్ట్రలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.గడిచిన 24గంటల్లో దాదాపు 47 వేల  కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆరోగ్య విభాగం దారుణంగా విఫలం అవుతుందని,అప్పుడు ఎవరు ఏం చేయలేరని హెచ్చరించారు. శుక్రవారం ఒక్క రోజే కరోనా కారణంగా మహారాష్ట్రలో 500 మందికి పైగా మరణించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు