దీదీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 10న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇక శుక్రవారం సువెందు అధికారి తన నామినేషన్ పాత్రలను సమర్పించారు. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. రాష్ట్రంలో తృణమూల్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది..

ఇక ఇది ఇలా ఉంటే మమతా బెనర్జీ తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది. తనకు సొంత వాహనం లేదని, బంగారం కూడా 9 గ్రాములే ఉందని అఫిడవిట్ లో మమతా పేర్కొన్నారు. తన వద్ద ఉన్న నికర ఆస్తుల విలువ రూ. 16.72 లక్షలేనని అఫిడవిట్‌లో మమత పేర్కొన్నారు. 2019-20లో రూ. 10,34,370 ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే, రూ. 69,255 నగదు ఉండగా, రూ. 13.53 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన రూ. 1.51 లక్షలు కూడా అందులోనే ఉందని మమత వివరించారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశానని, ఎల్ఎల్‌బీ కూడా చదివానని పేర్కొన్న మమత తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవన్నారు.

కాగా ప్రస్తుతం కాలికి గాయం కావడంతో మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఎడమకాలి చీలమండలానికి గాయం కావడంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు నెలలపాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. దింతో ఆమె ఎన్నికల ప్రచారం వీల్ చైర్ మీద కూర్చొని చేస్తానని తెలిపారు. ఇక మమతకు గాయమైన వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల సంఘంపై తృణమూల్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఈసీ ఖండించింది. మమతాను ఎవరు కిందకు తోయలేదని, ఆమె కాలు కారు డోర్ లో పెట్టిందని చెబుతన్నారు. దీనిపై విచారణ వేగవంతం చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

దీదీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు