మెహుల్ చోక్సీ అరెస్ట్ వెనుక ఉన్న ఆ మాయ లేడి ఎవరు?

మే 23 న కారిబియన్ ద్వీపం అయినా డొమినికాలో మెహుల్ చోక్సీ అరెస్ట్ అయ్యారు. డొమినికా పోలీసుల ప్రకారం మెహుల్ చోక్సీ ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు అందుకే అరెస్ట్ చేసాము అని చెప్పారు. చోక్సీ ఫై ఇంటర్పోల్ రెడ్ కార్నెర్ నోటీసు ఉంన్నందున అతన్ని భారత దేశానికీ అప్పగించే ఆలోచనలనో ఉన్నట్టు దేశ ప్రభుత్వం తెలిపింది.

కానీ మెహుల్ చోక్సీ భార్య మరియు అతని లాయర్ల వాదన వేరేలా వుంది.అతని భార్య ప్రీతి చోక్సీ మే 23 తన భర్తతో మాట్లాడాను అని ఆరోజు అతను బార్బారా అనే మహిళతో కలిసి డిన్నర్ కి వెళ్తున్నట్టు చెప్పారు అంది. తన భర్త బార్బారా ఇంటి వద్దకు వెళ్లి ఆమెని పిలవగా ఆమె తన ఇంటికి మరమత్తులు చేయించాను అని వచ్చి చూడవల్సిందిగా కోరగా మెహుల్ చోక్సీ లోపాలకి వెళ్లారు.

వెంటనే కొంత మంది వ్యక్తులు ఇంటి లోపలకి ప్రవేశించి మెహుల్ చోక్సీ ని కొట్టడం మొదలు పెట్టారు అని వారు పోలీసులమని చెప్పారు అని ఆమె తెలిపింది. వారు ఆయన్ని ఒక వీల్ చైర్ కి కట్టేసి పడవలో ఎక్కించి కారిబియన్ ద్వీపం అయినా డొమినికాకి తీసుకు వెళ్ళరు
అని అక్కడ అప్పటికే వేచి వున్నా ఆ దేశ పోలీసులు మెహుల్ చోక్సీ ని అరెస్ట్ చేసారు అని తెలిపించి. పడవలో వెళ్తున్న అంట సేపు కూడా వారు తన భర్తని కొట్టారు అని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చిత్ర హింసలు పెట్టారు అని ఆమె తెలిపింది.

అసలు ఎవరు ఈ మహిళా? ఆంటిగ్వా మీడియా కథనాల ప్రకారం ఆమె పేరు బార్బరా జరాబికా అని ఆమె బల్గేరియా చెందిన మహిళగా, ఆగస్ట్ 2020 నుంచి ఆమె మెహుల్ చోక్సీ ఇంటి ఎదురుగా ఉంటుంది అని పేర్కొన్నాయి. చోక్సీ భార్య ప్రకారం బార్బరా జరాబికా తన భర్తతో స్నేహం పెంచుకొని అతన్ని అపహరించడంలో సహకరించింది అని తెలిపారు.

చోక్సీ ని అపహరించిన తరువాత రోజు నుంచి బార్బరా కూడా ఆంటిగ్వా నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు అని అక్కడ మీడియా కథనాలు వచ్చాయి.

మెహుల్ చోక్సీ ని భారత్ తీసుకురాడానికి వున్నా చట్టపరమైన అడ్డంకులు: మెహుల్ చోక్సీ భారత్ లో చేసిన ఆర్థిక నేరాలకు అతని పైన
ఇంటర్పోల్ రెడ్ కార్నెర్ నోటీసు వుంది. కానీ చోక్సీ తరపు లాయర్లు అతను భారత పౌరుడు కానందున అతన్ని భారత్ పంపడానికి చట్ట ప్రకారం కుదరదు అన్నారు.

ఐతే భారత ప్రభుత్వం మాత్రం మెహుల్ చోక్సీ తన పాసుపోర్టు ఇచ్చిన ఇంకా అధికారికంగా పాసుపోర్టు సరెండర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అని తెలిపింది. భారత ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు ఇప్పటికే అక్కడికి చేరుకొని మెహుల్ చోక్సీని భారత్ కి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

దీనికి తోడు ఆంటిగ్వా ప్రభుతము కూడా మెహుల్ చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేస్తునట్టు ప్రకటించింది. దీనిపై చోక్సి లాయర్లు ఇప్పటికే ఆ దేశ కోర్టుకు వెళ్లారు.మరో వైపు డొమినికా కోర్ట్ చోక్సికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 14 కి వాయిదా వేసింది.

మెహుల్ చోక్సీ భార్య మరియు తన తరుపు లాయర్లు 3 దేశాలు కలిసే ఇలా చేసాయి అని ఆరోపిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు