ఎంఎస్ ధోని తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ – ఆందోళనలో అభిమానులు

ms dhoni parents tested positvie for corona

ఎంఎస్ ధోని తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారిద్దరు రాంచీలోని ఓ ప్రముఖ హాస్పటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2021 సీజలో ఆడుతున్న ధోనికి ఈ విషయం తెలిసినప్పటికి ఏం చేయలేని స్థితిలో ధోని ఉన్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ నేపథ్యంలో అందరు క్రికెటర్లతో పాటు ధోని సైతం బయోబబుల్లో ఉన్నాడు.ఈ కారణంగా ధోని బయటకు వెళ్లడం సాధ్యపడదు. అలాగే కోవిడ్ పెషంట్లు వెంట ఎవరు ఉండకూడదు అనే నిబంధన ఉన్న నేపథ్యంలో, ఎంఎస్ ధోని రాంచీలోని హాస్పటల్ కు వెళ్లినప్పటికి ఉపయోగం లేదని సన్నిహితులు వారించడంతో ధోని సైతం వెనక్కి తగ్గి తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడినట్టు వెల్లడించారు. ప్రస్తుతం వారు చికిత్స తీసుకుంటున్నా వారు క్షేమంగా ఉంటారని భావిస్తున్నా అని ధోని ఉద్వేగానికి లోనయ్యారు.

దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న కోవిడ్ కేసులు

భారతదేశంలో బుధవారం నాటికి మొత్తం 2 లక్షల 95 వేల 041 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి,  24 గంటల్లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు రికార్డు సృష్టించాయి. గత 24 గంటల్లో దేశంలో 2,023 మరణాలు, 1,67,457 డిశ్చార్జెస్ నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1 కోటి 56 లక్షల 16 వేల 130 ఉండగా మొత్తం రికవరీ 1 కోటి 32 లక్షల 76 వేల039 గా ఉంది. ఇక కోవిడ్ కారణంగా దేశంలో ఇప్పటి వరకు 1 లక్షా 82 వేల 553 మంది మరణించగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21 లక్షలా 57 వేల 538 గా ఉంది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు