Corona Cases: ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.

Corona Cases: ఇండియాలో కరోనా అదుపులోకి వచ్చిందనుకునే సమయంలోనే కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. నిన్నమొన్నటివరకు 50 వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు ఈ రోజు 54,069 గా నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా పెరిగాయి దేశవ్యాప్తంగా 1321 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

వీరిలో ఒకరి కరోనా డెల్టాప్లస్ వేరియంట్ కారణంగా మృతి చెందినట్లుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో దేశంలో మొదటి డెల్టాప్లస్ కరోనా వేరియంట్ నమోదైంది. గురువారం నమోదైన కేసులతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,00,82,778.

మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,91,981. అత్యధిక మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే 30,16,26,028 మందికి టీకా వేశారు. ఇక గడిచిన 24 గంటల్లో 64,89,599 మందికి టీకా పంపిణి చేశారు. టీకాలు అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇక టీకాల పంపిణీలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు