నోట్ల కట్టలతో బూందీ, మిక్చర్ పొట్లాలు – స్మగ్లింగ్ లో కొత్త తరహా ఐడియా

news ideas in smugling

కూటి కోసం కోటి విద్యలు అనేది పాత సామెత.. స్మగ్లింగ్ కోసం కోటి ఐడియాలు అనేది నేటి మాట.. విదేశాల నుంచి బంగారం, విదేశీ కరెన్సీను వివిధ మార్గాల్లో తీసుకురావటం కామన్. ఎయిర్ పోర్ట్ లోని కస్టమ్స్ అధికారులు వాళ్లను పట్టుకోవటం కామన్.. ఇలా దొరక్కుండా అద్బుతమైన ఐడియాతో.. అందర్నీ షాక్ కు గురి చేశాడు ఓ వ్యక్తి.

దుబాయ్ నుంచి హైదరాబాద్ కు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వీళ్లు మిక్చర్, బూందీ ప్యాకెట్లు పెద్ద ఎత్తున పట్టుకొచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో మిక్చర్, బూందీ ప్యాకెట్లు ప్యాసింజర్ల దగ్గర ఉండటంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అత్యంత జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అవాక్కయ్యారు. మిక్చర్, బూందీ ప్యాకింగ్ చాలా లావుగా.. పకడ్చందీగా ఉంది. ఏంటా అని చూస్తే.. ప్యాకింగ్ మధ్యలో విదేశీ కరెన్సీ నోట్ల కట్టలను చాలా చక్కగా అమర్చారు. దాని విలువ కోటి 30 లక్షలు ఉంది.

అమెరికా డాలర్లతోపాటు కువైట్ దినార్స్, సౌదీ రియాల్స్, యూఏపీ దిర్హామ్స్ ఉన్నాయి. వాస్తవంగా అయితే ఈ కోటి 30 లక్షలకు 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ 12 లక్షలను చెల్లించటానికి ఇష్టపడని వారు.. నోట్ల కట్టలనే బూందీ, మిక్చర్ ప్యాకింగ్ గా మార్చి.. ఎంతో తెలివిగా తీసుకొచ్చారు.

హైదరాబాద్ గల్లీల్లో విచ్చలవిడిగా.. ఎక్కడి పడితే అక్కడ బూందీ, మిక్చర్ దొరుకుతుంది.. అలాంటి కిలోల కొద్దీ మిక్చర్ ను దుబాయ్ నుంచి తీసుకొస్తుంటే అనుమానం రాదా ఏంటీ.. ఇక్కడే దొరికిపోయారు వీళ్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు