నివర్ తుఫాన్ దూసుకొస్తోంది : చెన్నైలో నల్లమబ్బులు, వర్షం

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్గ్ గోదావరి జిల్లాల్లోని

nivarcyclone

నివర్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుండటంతో.. దాని ప్రభావం తమిళనాడు రాష్ట్రం చెన్నై పట్టణంపై స్పష్టంగా కనిపిస్తోంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు వస్తున్న ఈ తుఫాన్.. తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 2020, నవంబర్ 25వ తేదీ ఇది తీరం దాటి.. భారీ నుంచి అతి భారీ వర్షాలకు కారణం కాబోతున్నది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఏపీకి కూడా నివర్ తుఫాన్ గండం ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. అదే విధంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ 25, 26 తేదీల్లో వర్షాలు పడతాయని.. కొన్ని చోట్ల భారీ వానలు పడే అవకాశం ఉందని సూచించింది వాతావరణ శాఖ.

ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా గాలులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తుంటే.. రాబోయే రెండు, మూడు రోజుల్లో గాలుల వేగం 80 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్గ్ గోదావరి జిల్లాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మొదటి ప్రమాదహెచ్చరిక ఎగురవేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు