అధికార పార్టీపై వార్తలు రాస్తేనే కేసుల్లేవు.. ఇక ప్రతిపక్షంపై విరుచుకుపడితే.. వైసీపీకి కలిసివచ్చేనా.. ఆ కేసులన్నీ తుస్సేనా..

no cases on media over comments on govt

కులంపై ద్రోహం చెల్లదు.. పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై కేసులు పెట్టటాన్ని తప్పు బడుతూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని విమర్శించే హక్కు పాలకులకు ఉంది.. 124ఏ రాజద్రోహం, 505 ప్రజలను రెచ్చగొట్టడం సెక్షన్ల నుంచి పాత్రికేయులకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పు మొత్తం ఎలా ఉన్నా.. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల సారాంశం ఇదీ..

అధికారంలోని పార్టీలపై ఏదైనా రాయొచ్చు.. ఏదైనా వాగొచ్చు.. హద్దు మీరనంత వరకు అని తేలిపోయినప్పుడు.. ఇక ప్రతిపక్షంపై ఇంకెంత రెచ్చిపోతారు.. ఇప్పుడు ఇదే పాయింట్ అయ్యింది. కాగల కార్యం గంధర్వులే తీర్చారనే సామెత.. ఇప్పుడు ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చినట్లే.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినంత మాత్రాన రాజద్రోహం, ఇతర కేసులు పెట్టటానికి వీల్లేనప్పుడు.. ప్రతిపక్షంపై అధికార పార్టీ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విరుచుకుపడి పరిస్థితి ఏంటీ.. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది.

దేశంలోనే పవర్ ఫుల్ సోషల్ మీడియా వింగ్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి.. వీళ్లు వేసే పంచ్ లు, అరాచకపు సోషల్ మీడియా దాడులు ఏ రేంజ్ లో ఉంటాయంటే.. దానికి ఉదాహరణ 2019 ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. మొన్నటి వరకు ఏపీ కోర్టు ఆదేశాలతో వైసీపీ సోషల్ మీడియాపై సీఐడీ కేసులు నమోదు చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ కేసులన్నీ వీగిపోయినట్లే.. ఎందుకంటే.. కొన్ని పత్రికల్లో వచ్చినట్లు ఇందులో డైరెక్ట్ ఎటాక్ ఉండదు.. అంతా పరోక్షంగా.. కామెడీగా.. సెటైర్లుగా.. సునిశితంగా ఉంటాయి. అలాంటి సోషల్ మీడియా వార్తలు, పోస్టులు, ఫొటోలు, వీడియోలపై ఇప్పుడు యాక్షన్ తీసుకోవటం అనేది అసాధ్యం.

మూడు రోజులుగా ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు.. బ్లూ మీడియా సోషల్ మీడియాకు బూస్ట్ ఇస్తున్నాయి. ఇక దంచుడే.. ముందూ వెనకా చూసేది ఏంటీ.. అమ్మడు లెట్స్ కుమ్ముడు అంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గ్రూప్స్. ఇన్నాళ్లు కేసులు, కోర్టు ఆదేశాలు, సీఐడీ విచారణలు అని ఎక్కడో ఏదో భయం ఉండేది.. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీపై.. చంద్రబాబు, లోకేష్ పై కొత్త తరహాలో విరుచుకుపడటానికి సరికొత్తగా సిద్ధం అవుతుందంట బ్లూ మీడియా.. మరి దీనికి ఎల్లో గ్యాంగ్ కౌంటర్లు ఎలా ఉంటాయో చూడాలి…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు