లాక్ డౌన్ పై ప్రధాని కీలక ప్రకటన – టీకా ఉత్సవ్ పేరుతో మరో పండుగ

PM Modi to hold a video-conference with CM’s of all States on 8th April

కరోనా సెకంట్ వేవ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని పలు కీలక సూచనలు చేశారు. దేశంలో లాక్ డౌన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదని స్పష్టం చేసిన మోదీ, నైట్ కర్ఫ్యూ విధించడం ద్వారా కొంత వరకు కరోనాను కట్టడి చేయవచ్చని వెల్లడించారు.

ఇక దేశవ్యాప్తంగా టెస్ట్ ల సంఖ్యను పెంచాలని సూచింన మోదీ, ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని సూచించారు. టెస్ట్ ల సంఖ్యతో పాటు, టికా పై అవగాహాన కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని సూచించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు