గోవాలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా.. లాక్ డౌన్ పెట్టినా కట్టడిలోకి రాని కరోనా..

one in two has covid in goa

గోవా అంటే.. బీచులు, బార్లు, పబ్స్, కాసినోలు ఇలా ఎంజాయ్ గుర్తుకొస్తుంది.. ఏ మాత్రం బోర్ కొట్టినా.. నలుగురు కుర్రోళ్లు కలిసి గోవా చెక్కేసి చిందులేసి వస్తుంటారు.. అలాంటి గోవా రాష్ట్రం ఇప్పుడు కరోనాతో విలవిలలాడుతోంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి కోరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.

మే 7వ తేదీ 8 వేల 178 మందికి పరీక్షలు నిర్వహిస్తే.. 4 వేల 195 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. పాజిటివ్ రేటు 51 శాతంగా ఉంది.. ఇప్పుడు ఇదే గోవా రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వారం క్రితమే అంటే మే ఒకటో తేదీ నుంచే లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.

అన్ని బీచ్ లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్, బార్లు, పబ్స్, టూరిజం అంతా బంద్ చేసింది. సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో రోజువారీగా 2 వేల కేసులు మాత్రమే ఉంటే.. ఈ వారం రోజుల్లో అవి రెట్టింపు కావటం ఆందోళనకు గురి చేస్తోంది. పాజిటివ్ రేటు 51 శాతంతో.. దేశంలోనే అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో గోవా ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

మే 7వ తేదీ శుక్రవారం ఒక్క రోజే 56 మంది చనిపోయారు. ఇప్పటికీ గోవాలో 32 వేల యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. రికవరీ రేటు 70శాతంగా ఉంది. అంటే రోజువారీగా 30 శాతం మంది అదనంగా కరోనా పాజిటివ్ బాధితులు నమోదవుతున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో కోవిడ్ చికిత్స అందించటంతోపాటు అదనపు బెడ్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 24 గంటలూ ఆక్సిజన్ సరఫరా కోసం.. 20 వేల లీటర్ల ట్యాంకర్ ను అందుబాటులో ఉంచింది. మెరుగైన వైద్యం కోసం అన్ని ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించి.. కరోనా కిట్స్ అందిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు