ఎన్నికలు అయిపోయాయి కదా : ఇంకెందుకు ఆలస్యం లాక్ డౌన్ పెట్టండి-జనం డిమాండ్ ఇదే..

Sunday lockdown imposed in Uttar Pradesh

దేశంలో కరోనా బీభత్సంగా ఉంది.. రోజువారీ కేసులు 4 లక్షలకు చేరాయి. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మందులు, ఇంజక్షన్స్ కొరత వేధిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఉండొచ్చని స్పష్టంగా చెప్పేస్తున్నారు డాక్టర్లు, శాస్త్రవేత్తలు. ఇదే సమయంలో ఎయిమ్స్ వైద్య బృందం సైతం కేంద్ర ప్రభుత్వానికి ఓ సూచన చేసింది. రెండు వారాలు అయినా లాక్ డౌన్ పెట్టండి అని తేల్చి చెప్పేసింది. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం, అమెరికా నిపుణులు కూడా లాక్ డౌన్ పెడితేనే కరోనా కట్టడి అవుతుందని సలహా ఇస్తున్నారు.

కొన్ని రోజులుగా లాక్ డౌన్ పై వస్తున్న వార్తలకు స్పందించిన కేంద్రం.. ఆ ఉద్దేశం లేదని వివరణ ఇస్తూ వస్తుంది. జనం మాత్రం దాన్ని నమ్మటం లేదు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, కౌంటింగ్ ఉందని.. అందుకే లాక్ డౌన్ పెట్టటం లేదని భావిస్తున్నారు. ఇదే సమయంలో మే 2వ తేదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. బీజేపీ ఓడిపోయింది.. ఆశించిన స్థాయిలో గెలుపు రాలేదు..

ఇక ఇప్పుడు దేశంలో జనం నాడి ఎలా ఉందో తెలుసా.. ఎన్నికలు అయిపోయాయి.. ఓడిపోయారు కదా.. ఇప్పుడైనా జనం గురించి బీజేపీ, మోడీ ఆలోచిస్తారు.. ఇంకెందుకు ఆలస్యం లాక్ డౌన్ పెట్టేయండి అని డిమాండ్ చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 3 వేల 500 మంది మాత్రమే చనిపోతున్నారని ప్రభుత్వాలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నారు ప్రజలు. గ్రామాలు, పట్టణాలు అన్ని తేడా లేకుండా జనం కరోనా బారిన పడి చితికిపోతున్నారని.. ఇకనైనా దేశంలో కరోనా గురించి ఆలోచించాలని.. కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.

ఈ ఘోర విపత్తు నుంచి బయటపడాలంటే కనీసం 15 రోజులు అయినా లాక్ డౌన్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఇది ఎక్కడికి వెళుతుందో.. ఎంత మంది ప్రాణాలను తీసుకుంటుందో అనే భయం వెంటాడుతోంది.

ఎన్నికలు అయిపోయాయి కదా.. ఇకనైనా లాక్ డౌన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు జనం.. మరి మోడీ ఆలోచిస్తారా లేదా.. సుప్రీంకోర్టు సైతం లాక్ డౌన్ ఎందుకు ఆలోచించటం లేదు అని ప్రశ్నించింది కూడానూ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు