ఒకే దేశం – ఒకే ఎన్నికలపై మోడీ సంచలన వ్యాఖ్యలు

ఒకే దేశం - ఒకే ఎన్నికలపై మోడీ సంచలన వ్యాఖ్యలు.. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల గోల నడుస్తుంది. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి, సంక్షేమం రెండు నెలలు ఆగిపోతుంది. ఏ పని చేయటానికి

PM Modi

దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని.. దీని వల్ల అభివృద్ధి ఆగిపోతుందని.. కుంటుపడుతుందన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలపై విస్తృతంగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు మోడీ.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు.. ఆయా రాష్ట్రాల కాలపరిమితి ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న బీహార్ ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ఎన్నికలు రాబోతున్నాయి. దీని వల్ల దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల గోల నడుస్తుంది. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి, సంక్షేమం రెండు నెలలు ఆగిపోతుంది. ఏ పని చేయటానికి వీలు లేదు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకోవటం ఆలస్యం జరిగి దేశాభివృద్ధికి నష్టం జరుగుతుంది.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకే దేశం – ఒకే ఎన్నికల విధానంపై కసరత్తు చేస్తూనే ఉంది. పార్లమెంట్ తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తుంది.

పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తయిన వెంటనే.. ఆయా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. అంటే మునిసిపాలిటీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ముగించేయాలని ఆలోచిస్తుంది.

దీని వల్ల ఐదేళ్లపాటు దేశంతోపాటు ఆయా రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్టటానికి వీలుంటుంది.

ప్రధాని మోడీ గురువారం చేసిన వ్యాఖ్యలతో దేశంలో జమిలీ ఎన్నికలపై అంశం చర్చకు దారి తీసింది. 2022 లేదా 2023లోనే జమిలీ ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం ఆలోచిస్తుంది అన్న వార్తలు, ప్రచారానికి మోడీ చేసిన వ్యాఖ్యలు బలాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంగీకారం తెలుపుతూ.. తీర్మానం చేసి పంపించాల్సి ఉంటుంది. దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ, అనుకూల ప్రభుత్వాలు ఉండటం వల్ల ఈసారి జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు